ఉపాధి కల్పనే ఆయువు పట్టు - ఉద్యోగ కల్పనే భవిత కు భరోసా -డాక్టర్ గేదెల శ్రీనుబాబు
ఆలోచనని ఆచరణలో పెట్టే నైజం పారిశ్రామిక దిగ్గజం డాక్టర్ గేదెల శ్రీనుబాబుది. ఉత్తరాంధ్రకి చెందిన మహాకవి గురజాడ అప్పారావు గారి ``ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్..గట్టి మేలు తలపెట్టవోయ్ దేశమంటే మట్టి కోదోయ్ దేశమంటే మనుషులోయ్..గట్టి మేలు తలపెట్టవోయ్..పాడిపంటలు పొంగిపొరిలే దారిలో నువ్వు పాటుపడవోయ్...పూను స్పర్థలు విద్యలందే..వైరములు వాణిజ్యమందే`` అన్న మాటలు తన బాటగా చేసుకున్నారు. మాటలు చెప్పకుండా చేతల ద్వారా తాను జన్మభూమికి చేయాలనుకున్న సాయం అందిస్తున్నారు. ఉపాధి, ఉద్యోగ కల్పన ద్వారా యువత భవితకి భరోసానిస్తూ, పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఆయా రాష్ట్రాలకి ఆదాయం సముపార్జిస్తున్నారు. తెలుగు విద్యార్థులు విద్యార్జనలో పోటీపడాలని పిలుపునిస్తున్నారు. తెలుగువాళ్లు ఎంట్రప్రెన్యూర్లు కావాలని ఆశిస్తున్నారు. మారుమూల పల్లె నుంచి వచ్చి దేశవిదేశాల్లో మారుమోగుతున్న పేరు డాక్టర్ గేదెల శ్రీనుబాబు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి కేరాఫ్ అడ్రస్. డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ క్రియేట్ చేయడంలో బ్రాండ్ అంబాసిడర్. ఉత్తరాంధ్ర నుంచి ఉదయించిన పారిశ్రామిక దిగ్గజం డాక్టర్ గేదెల శ్రీనుబాబు.
పల్సస్ గ్రూప్ భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 30,000 ఉద్యోగాలను సృష్టించింది. ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2024 వరుకి అత్యధిక ఉద్యోగాలు కల్పించిన సంస్థగా పల్సస్ గుర్తింపు పొందటంలో మెరుగైనా పాత్ర శ్రీనుబాబు పోచించారు.
ఉచితంగా అందుబాటులోకి శాస్త్రీయ విజ్ఞానం
శాస్త్రీయ విజ్ఞానాన్ని పరిశోధకులకు ఉచితంగా అందుబాటులోకి తేవడం ద్వారా తనదైన శైలిని చాటుకున్న శ్రీనుబాబు.. భారతదేశంలో డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ క్రియేట్ చేయడానికి మార్గదర్శకత్వం వహించారు. G20 సమ్మిట్‌లలో చురుకుగా పాల్గొని అనుబంధంగా సెమినార్లు నిర్వహించిన మాస్టర్ మైండ్. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం రంగానికి సంబంధించిన కీలకమైన సమాచారం ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో మారుమూల పల్లెలకూ సమాచారం వ్యాప్తికి దోహదపడ్డారు.
పల్లె నుంచి ఢిల్లీకి..
శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లోని అల్లెన అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు,పల్లె నుంచి ఢిల్లీకి ఎదిగిన క్రమంలో ఎన్నో కష్టాలున్నాయి. మరెన్నో అవాంతరాలు ఎదురయ్యారు. సాధించాలనే తపన, కష్టపడే తత్వం అడ్డంకుల్ని అధిగమించి లక్ష్యానికి చేరువయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ బి.ఫార్మ్, ఎం.టెక్, పిహెచ్.డి, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టరేట్ పూర్తి చేసారు. 2007లో 25 ఏళ్లకే Ph.D పట్టా అందుకుని డాక్టర్ గేదెల శ్రీనుబాబుగా ఎదిగారు. వివిధ పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో సుమారు 30 వ్యాసాలను శ్రీనుబాబువి ప్రచురితం అయ్యాయి. గూగుల్ స్కాలర్ స్కోర్ మేరకు గేదెల శ్రీనుబాబు సైంటిఫిక్ హెచ్-ఇండెక్స్ 13, ఐ10-ఇండెక్స్ 19.
విలేజ్ టు గ్లోబల్ జర్నీ శ్రీనుబాబు
వ్యవసాయ కుటుంబంలో కష్టపడే తత్వం, పల్లెటూరు వాళ్లకే ఎదురయ్యే భాషా సమస్యలు తాను అధిగమిస్తూనే విలేజ్ టు గ్లోబల్ జర్నీలో ఎన్నో వినూత్న ఆవిష్కరణలకి శ్రీనుబాబు ఆద్యుడయ్యారు. తన ఇన్నోవేటివ్ లీడర్‌షిప్ తో గ్లోబల్ రీసెర్చ్ అండ్ కాన్ఫరెన్స్ల నిర్వహణలో పల్సస్ గ్రూప్ ని అగ్రస్థానంలో నిలిపారు. శ్రీనుబాబు నాయకత్వంలో పల్సస్ గ్రూప్, 18 పబ్లిషింగ్ బ్రాండ్‌లను నిర్వహిస్తోంది. ఏటా 50,000 పరిశోధన కథనాలను ప్రచురిస్తోంది. 3,000కి పైగా హెల్త్ కేర్, అగ్రికల్చర్, టెక్నాలజీ, ఐటీ రంగాలకు సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులతో ప్రపంచ సమావేశాలను నిర్వహిస్తోంది. వీటి ద్వారా శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిని సులభతరం చేశారు. పల్సస్ సంస్థ ఆరు సెజ్ ల నుంచి 5,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉద్యోగులలో 75 శాతం మంది మహిళలు ఉండటం మరో విశేషం. హైదరాబాద్, చెన్నై, వైజాగ్ , ఢిల్లీలో పల్సస్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. విలియం సి. రాబర్ట్స్ రాసిన పుస్తకం "Facts and ideas from anywhere - Inventions that changed society and produced prosperity of the world" సమాజాన్ని మార్చిన మరియు ప్రపంచ శ్రేయస్సును అందించిన ఆవిష్కరణలు శాస్త్రీయ పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సమాచారం ఓపెన్-యాక్సెస్ పబ్లిషింగ్ కార్యక్రమాలు అమలులో డాక్టర్ శ్రీనుబాబు గేదెల కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు.
జీ20 సిరీస్ కాన్ఫరెన్సులు శ్రీనుబాబు నాయకుడై నడిపించాడు
శాస్త్ర సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, ఫార్మాస్యూటికల్ రంగంపై బాగా పట్టున్న డాక్టర్ గేదెల శ్రీనుబాబు నాయకత్వంలో జీ20 సిరీస్ సమ్మిట్స్ విజయవంతంగా నిర్వహించారు. కో-కన్వీనర్ బాధ్యతలు స్వీకరించి G20, హెల్త్20, ఫార్మా20 , టెక్20 సమ్మిట్ సిరీస్ లు నిర్వహించిన గేదెల శ్రీనుబాబు దేశమంతా ఆశ్చర్యపోయే ఫలితాలు రాబట్టారు. G20 సమ్మిట్‌ల ద్వారా భారతదేశం టెక్ టాలెంట్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ శక్తిని ప్రపంచానికి చాటారు. G20 హెల్త్ కేర్ ప్రీ-మీటింగ్‌లను నిర్వహించడం వరకు విస్తరించింది, ఇది భవిష్యత్తులో G20 హెల్త్ కేర్ యాక్సెసిబిలిటీ కల్పించడంతోపాటు ఈ రంగంలో నాయకత్వం వహిస్తున్న 200కి పైగా కంపెనీల నాయకత్వాన్ని ఒకే వేదికపైకి రప్పించడంలో కీలక పాత్ర పోషించారు.
G20 దేశాలలో అందరికీ అందుబాటులో ఆరోగ్యం అనే లక్ష్యం చేరుకోవడం ద్వారా అసమానతలు లేని సమానత్వం సాధించగలమని శ్రీనుబాబు ప్రపంచానికి చాటి చెప్పారు. G20 గ్లోబల్ ఫార్మా సమ్మిట్, G20 గ్లోబల్ హెల్త్ సమ్మిట్ సిరీస్‌లను ప్రారంభించడంలో కూడా గేదెల శ్రీనుబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగాలను అభివృద్ధి చేయడంలో శ్రీనుబాబు ఎనలేని కృషి చేస్తున్నారు. సాంకేతిక పురోగతి, ఆరోగ్య సంరక్షణ రంగాలలో అంతర్జాతీయంగా పరస్పర సహకారం ఉండాలని గ్లోబల్ టెక్ సమ్మిట్ కో-కన్వీనర్ డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఆశయాలు జీ20 విస్తృత లక్ష్యాలకి దగ్గరగా ఉన్నాయి. గ్లోబల్ టెక్ సమ్మిట్ కో-కన్వీనర్‌గా, ఫిబ్రవరి 2023లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన సమావేశాలను శ్రీనుబాబు నిర్వహించారు. టెక్, ఫార్మా, ఆరోగ్య రంగాలకు చెందిన ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులను ఒక చోటుకి చేర్చారు. ఈ సమావేశాలలో 100కి పైగా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి.
విశాఖపట్నం సదస్సుకు 25కి పైగా దేశాల నుండి 400 మంది విదేశీ ప్రతినిధులు సహా 1,400 మంది హాజరయ్యారు. G20 గ్లోబల్ టెక్ సమ్మిట్ లక్ష్యం మేరకు పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయాలని కేంద్రమంత్రి, ఇతర ప్రభుత్వ ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన G-20 నగరాల్లో ఫ్యూచర్ గ్లోబల్ టెక్ సమ్మిట్‌లు నిర్వహణకి ప్రణాళికలు సిద్ధం చేశారు .
అందరికీ అందుబాటు లో ఆరోగ్యమే లక్ష్యంగా వంద పడకల ఆస్పత్రి
అందరికీ అందుబాటులో వైద్యం అనేది జీ20 లక్ష్యం. ఈ దిశగా అడుగులు వేశారు పల్సస్ సీఈవో డాక్టర్ శ్రీనుబాబు. అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వంద పడకలతో పల్సస్ విజయ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ /రీసెర్చ్ సెంటర్ 2023లో ఆరంభించి అందరికీ అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేశారు. పల్సస్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకం మద్దతుతో, ఈ హాస్పిటల్ ద్వారా G20 లక్ష్యమైన గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్యచికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అంటే మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు. ఈ అపోహలను పటాపంచలు చేస్తూ మారుమూల ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు.
శ్రీనుబాబు సేవామార్గం..అనితర సాధ్యం
డాక్టర్ గేదెల శ్రీనుబాబు నేతృత్వంలో సాగే సేవా కార్యక్రమాలు రోజురోజుకీ మరింత విస్తృతమయ్యాయి. పాలకొండ వంటి గ్రామీణ ప్రాంత ప్రదేశంలో శ్రీ సత్యసాయి పాఠశాల, కళాశాలలు నెలకొల్పి 4 వేల మంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యని అందిస్తున్నారు. తితిలీ తుఫానుతో నిరాశ్రయులైన లక్షల కుటుంబాలకి చేదోడుగా నిలిచారు. అత్యవసరమైన వస్తువులు, దుస్తులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో సోషల్ మీడియా ద్వారా అవేర్ నెస్ క్రియేట్ చేశారు. శానిటైజర్లు, మాస్కులు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర గ్రామీణులకి పంపిణీ చేశారు. గ్రామాల అభివృద్ధి, విద్య, వైద్య రంగాలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఉన్నారు. ఒక కోటి రూపాయల విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు 50 లక్షల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వానికి కరోనా సమయంలో ఇచ్చారు.
FABA వైస్ ప్రెసిడెంటుగా విశేష కృషి
ఫెడరేషన్ ఆఫ్ ఆసియా బయోటెక్ అసోసియేషన్స్ (FABA) వైస్ ప్రెసిడెంట్‌గా
2013లో శ్రీనుబాబు గేదెల పనిచేశారు. FABA కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో విస్తరించడానికి శ్రీనుబాబు సేవలు చాలా కీలకమని BS బజాజ్ చెప్పారు. ఆసియాలోని ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, బయోటెక్నాలజీ రంగంలో వృద్దికి FABA వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీనుబాబు పాత్ర ఎనలేనిది. శ్రీనుబాబు నైపుణ్యం నాయకత్వం ఔషధ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో దోహదం చేసింది. నూతన ఆవిష్కరణలు, వినూత్న విధానాలకి FABA వైస్ ప్రెసిడెంట్‌గా విశేష కృషి చేశారు. ఆసియాలో ఫార్మా , బయోటెక్ ల్యాండ్‌స్కేప్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కోసం కూడా డాక్టర్ శ్రీనుబాబు గేదెల పనిచేశారు.
యూరప్-ఇండియాల మధ్య వాణిజ్య వారధి
యూరప్ - భారతదేశం మధ్య సాంకేతిక మార్పిడి సహకారాన్ని పెంపొందించడానికి శ్రీనుబాబు అంకితభావంతో పనిచేశారు. గ్లోబల్ ఐటి, ఫార్మాస్యూటికల్ హబ్‌గా భారతదేశం దూసుకుపోతున్న తరుణంలో విజ్ఞాన, వ్యాపార భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను ప్రపంచం దృష్టికి తీసుకురావడంలో శ్రీనుబాబు సఫలీకృతమయ్యారు. ఐటి, ఫార్మాస్యూటికల్ రంగాలలో యూరోపియన్ పెట్టుబడులను సులభతరం చేస్తూ భారతదేశ సాంకేతిక పురోగతి, పరిశోధన, ఆవిష్కరణ సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో శ్రీనుబాబు సారధిగా వ్యవహరించారు.
2018లో, బెల్జియంలో పల్సస్ కేంద్రాన్ని స్థాపించడానికి ఒప్పందం కుదుర్చుకోవడానికి బెల్జియం ఎంబసీ, యూరోపియన్ ప్రతినిధి బృందం హైదరాబాద్‌లోని పల్సస్ గ్రూప్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు శ్రీనుబాబు కృషిని కొనియాడారు. 2019 గ్రీస్‌లో జరిగిన థెస్సలోనికి ఇంటర్నేషనల్ ఫెయిర్ (TIF)లో, డాక్టర్ శ్రీనుబాబు, భారత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సహకారంతో, గ్రీస్ ప్రధాన మంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో చర్చించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించాల్సిన ఆవశ్యకతని వివరించారు. ఈ లక్ష్యాలను సాధించడానికి, భారతదేశంలో యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్ (EBTC)ని స్థాపించడానికి ఇరు దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. EBTC మిషన్ ద్వారా అత్యాధునిక యూరోపియన్ సాంకేతికతలను అనుసరించడం ద్వారా భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తి -ఎగుమతుల నాణ్యతను మెరుగుపరిచే కార్యాచరణ ఆరంభమైంది.
డిజిటల్ ఇండియాలో పల్సస్ భాగస్వామ్యం
డిజిటల్ ఇండియా అనే మహా కార్యక్రమంలో పల్సస్ భాగస్వామ్యం ఉంది. సీఈఓ గేదెల శ్రీనుబాబు నేతృత్వంలోని పల్సస్ గ్రూప్, డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద 93 నగరాల్లోని 154 కంపెనీలను అధిగమించి, భారతదేశవ్యాప్తంగా కేటాయించిన 48,300 ఐబిపిఎస్ సీట్లలో 4,095 ఐబిపిఎస్ సీట్లను సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. రూ. 440 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో కార్యకలాపాలు ఆరంభించిన పల్సస్ 2019 నుండి 2023 వరకు 4,000 మంది మహిళా ఉద్యోగులతో సహా 5,000 ఉద్యోగాలు కల్పించింది. పల్సస్ చేరుకున్న ఈ లక్ష్యాలను ప్రశంసించిన కేంద్రమంత్రి, ఈ ప్రాజెక్టులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌లో 41 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో మంజూరు చేయించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని టైర్ 2, టైర్ 3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని గేదెల శ్రీనుబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉద్యోగ కల్పనలో 70 శాతం మంది మహిళలకి ప్రాధాన్యం కల్పించడాన్ని STPI డైరెక్టర్ జనరల్ పల్సస్ పాత్రను ప్రశంసించారు. పల్సస్ గ్రూప్ భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 30,000 ఉద్యోగాలను సృష్టించింది. ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2024 వరుకి అత్యధిక ఉద్యోగాలు కల్పించిన సంస్థగా పల్సస్ గుర్తింపు పొందటంలో మెరుగైనా పాత్ర శ్రీనుబాబు పోచించారు.
సమాచార సారధి
భాష అంతరాలని అధిగమించి శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య, ఆరోగ్య సమాచారం అందరికీ చేరవేయడమే లక్ష్యంగా శ్రీనుబాబు సాగిస్తోన్న ప్రస్థానం అప్రతిహతంగా ముందుకు వెళుతోంది.
హెల్త్ కేర్ , అగ్రికల్చర్ రంగాల సమాచారం అందరికీ చేరవేసే లక్ష్యంతో భాషా అంతరాలను తగ్గించడానికి స్థానిక భాషల్లోకి ఆయా సమాచారాన్ని అనువదించి అందించే బృహత్తర లక్ష్యాన్ని మొదలుపెట్టారు శ్రీనుబాబు. సంక్లిష్టమైన సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం మరియు స్థానికీకరణ చేయడంలో శ్రీనుబాబు విజయం సాధించారు. సమాచారాన్ని చేరుకోవడానికి వనరులు లేని కమ్యూనిటీలు సమాచారం చేరేలా సాధికారత కల్పించారు. ET నౌలో "శ్రీనుబాబు గేదెల లీడర్స్ ఆఫ్ టుమారో" కార్యక్రమంలో విజ్ఞాన అంతరాలను తగ్గించడంలో స్థానిక భాషల్లోకి అనువాదాల ప్రాముఖ్యత, అవసరాన్ని ఉద్వేగభరితంగా వివరించారు.
"మేక్ ఇన్ ఇండియా" రచన డాక్టర్ గేదెల శ్రీనుబాబు
ఆవిష్కరణ కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా
పల్సస్ గ్రూప్ CEO , G20 గ్లోబల్ టెక్ సమ్మిట్ సిరీస్ కో-కన్వీనర్ అయిన గేదెల శ్రీనుబాబు AI యొక్క విస్తారమైన సామర్థ్యాన్ని నొక్కిచెప్పారు. సస్టైనబుల్ గ్లోబల్ గ్రోత్‌పై జరిగిన G20 సమ్మిట్‌లో, వ్యవసాయం, ప్రజా సేవలు మరియు చట్టపరమైన పరిశోధనలను పునర్నిర్మించడంలో AI పాత్రను ఆయన విశదీకరించారు. $15 ట్రిలియన్ల ప్రపంచ అవకాశాన్ని వినియోగించుకోవడానికి 7 మిలియన్ల AI ఇంజనీర్లు మరియు డేటా శాస్త్రవేత్తల అవసరాన్ని ఆయన అంచనా వేశారు. AI యొక్క పెరుగుదల 2030 నాటికి 50 మిలియన్ల ఉద్యోగాలను భర్తీ చేయగలదని శ్రీనుబాబు విశ్లేషించారు. భారతదేశాన్ని గ్లోబల్ AI-ఆధారిత ఉత్పాదక కేంద్రంగా మారుతుందని, 2026 నాటికి ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దీనిని ముందుకు తీసుకెళ్లవచ్చని వివరించారు. గేదెల శ్రీనుబాబు రచించిన "మేక్ ఇన్ ఇండియా" పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, డిజిటల్ మార్కెటింగ్ ప్రచారం, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రాముఖ్యత వంటివి ప్రణాళికాబద్ధంగా పొందుపరిచిన ఈ విజన్ డాక్యుమెంట్ అమలు ద్వారా భారతదేశ ఆర్థిక భవిష్యత్తును రూపొందించవచ్చని శ్రీనుబాబు పేర్కొన్నారు.
ఉపాధి ఉద్యోగాల కల్పనతో ఉత్తరాంధ్రకి ఊపిరి
సహజ వనరులున్నా తరతరాలుగా అన్యాయానికి గురవుతున్న తన జన్మభూమి పట్ల ఆవేదన గూడుకట్టుకున్న శ్రీనుబాబు ఈ వెనుకబాటు పారద్రోలటానికి ఏమైనా చేయాలని అనుకునేవారు. తాను పుట్టిన ఊరు, తనకి చదువు చెప్పిన బడి, ఈ స్థాయిని తెచ్చిన ఆంధ్రా యూనివర్సిటీ, మొత్తంగా ఈ ప్రాంతానికి మేలు చేయడమే తన లక్ష్యంగా ముందుకు సాగారు. ఉపాధికి దూరమైన ఉత్తరాంధ్ర వలస బాట పట్టింది. ఈ దుస్థితి మార్చడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రాంతీయ అభివృద్ధి కార్యకలాపాలతోనే ఇది సాధ్యమని నమ్మి కార్యాచరణ ఆరంభించారు. 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చెందుతున్న AI, IT హబ్, వ్యాపారాలు మరియు ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారిన విశాఖపట్నాన్ని తన కార్యాచరణ కేంద్రంగా ఎంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 లక్షలు, ఉత్తరాంధ్రలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే శ్రీనుబాబు లక్ష్యంకి ప్రభుత్వ సహకారం అందింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విభిన్న పరిశ్రమలలో అవకాశాలు, విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్రలో ఉన్న వ్యాపార అవకాశాలను దేశం ముందుంచడంలో కీలక పాత్ర పోషించారు. 2023 ఫిబ్రవరిలో వైజాగ్ గ్లోబల్ టెక్ సమ్మిట్‌తో సహా 20కి పైగా గ్లోబల్ సమ్మిట్‌లకు బాధ్యత వహిస్తున్న పల్సస్ గ్రూప్, విశాఖపట్నం యొక్క అపారమైన సామర్థ్యాన్ని ఆవిష్కరించడానికి ఒక వేదికగా పనిచేస్తోంది. ప్రతి సంవత్సరం, సుమారు 5 లక్షల మంది తాజా గ్రాడ్యుయేట్లు , నిపుణులు ఆంధ్రప్రదేశ్ శ్రామికశక్తిలోకి ప్రవేశిస్తారు. 3.5 లక్షల మంది తాజా గ్రాడ్యుయేట్లలో 1.5 లక్షల మంది గ్రాడ్యుయేట్లు పరిసర ప్రాంతాల నుండి విశాఖపట్నంకు తరలివస్తున్నారు. ప్రతిభను, అవకాశాలను ఆకర్షిస్తూ విశాఖపట్నం ప్రగతిపథంలో దూసుకుపోతోంది.
ఉత్తరాంధ్ర వలసల్ని నిరోధించడమే ధ్యేయం
వనరులున్నా వినియోగంలోకి రాక, ఉపాధి అవకాశాలు లేక దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆరంభం అయ్యాయి. ఇప్పటివరకూ 22 లక్షల మంది ఉన్న ఊరిని, కన్న వారిని వదిలి గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో సహా సుదూర ప్రాంతాలకి వలస వెళ్లారు. పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు రాసిన ``ది గ్రేట్ మైగ్రేషన్ ఆఫ్ 2.2 మిలియన్ సోల్స్ `` అనే పుస్తకం ద్వారా 22 లక్షల మంది వలస విషాదగాథలు వెలుగులోకి వచ్చాయి.
స్కిల్ డెవలప్‌మెంట్
యువతకు సాధికారత కల్పించడంలో మరియు ఉపాధిని పెంపొందించడంలో స్కిల్ డెవలప్‌మెంట్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, శ్రీనుబాబు అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా, వ్యక్తులకు కొత్త నైపుణ్యాలను పొందేందుకు శిక్షణ అందించారు. ఔత్సాహికులకు వృత్తిపరమైన వృద్ధికి, స్థానిక శ్రామికశక్తికి తోడ్పడేందుకు ఈ నైపుణ్య శిక్షణ వీలు కల్పిస్తుంది.
పర్యావరణ పరిరక్షణకి కృషి
జూట్ వంటి పర్యావరణ అనుకూల వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించారు. ఈ ఉత్పత్తులు చేసే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కావాలని సూచించారు. ప్లాస్టిక్ కి ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల జనపనార వినియోగాన్ని ప్రోత్సహించడానికి శ్రీనుబాబు కృషి చేశారు. సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI)తో కలిసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను తగ్గించడం మరియు తొలగించే లక్ష్యంతో కూడిన కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు. క్లీన్-అప్ డ్రైవ్‌లను నిర్వహించడం, పునర్వినియోగ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం మరియు స్థానిక ఉపాధిని మెరుగుపరచడానికి మరియు స్థిరమైన పద్ధతులను అమలు చేయడానికి స్థానిక సంఘాలకు అధికారం కల్పించే లక్ష్యంతో పనిచేశారు.
నీటి నిర్వహణ వ్యూహాలు
ఉత్తరాంధ్రలో వ్రుధాగా పోతున్న నీటివనరులను ఒడిసిపట్టాలని శ్రీనుబాబు ఇరిగేషన్ పై నిపుణులతో కలిసి అధ్యయనం చేశారు. నీటి నిర్వహణ ప్రయత్నాలకు, ప్రత్యేకించి జల పరిరక్షణ, నదుల అనుసంధాన ప్రాజెక్టులు, సమర్ధవంతమైన నీటిపారుదల పద్ధతులు మరియు స్వచ్ఛమైన త్రాగునీటిని మెరుగుపరిచే లక్ష్యంతో ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందించారు.
జాబ్ మేళాలు
జాబ్ మేళాలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగిత రేటును తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి మరియు శ్రామికశక్తి అభివృద్ధిని ప్రోత్సహించడానికి గణనీయంగా దోహదపడ్డారు శ్రీనుబాబు. ప్రతిభ తగ్గ అవకాశాలని కల్పించడానికి ఈ జాబ్ మేళాలు వేదికగా నిలిపారు. ప్రభుత్వంతో పాటు ఉపాధి, పారిశ్రామిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు శ్రీనుబాబు. ఇండస్ ఫౌండేషన్, ఆంధ్రా యూనివర్శిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ తదితర సంస్థలతో కలిసి శ్రీనుబాబు సంస్థ కొన్ని సైన్స్ సదస్సులు నిర్వహించాయి.
డాక్టర్ గేదెల శ్రీనుబాబుకి వచ్చిన అవార్డులు
యంగ్ సైంటిస్ట్ అవార్డు
(సియోల్, దక్షిణ కొరియా, 2007)
ఉత్తమ IT/ITeS ఎగుమతి కంపెనీ అవార్డు
(2015లో HYSEA నుండి)
ఉత్తమ యువ పారిశ్రామికవేత్త అవార్డు
(2017లో హైదరాబాద్ మీడియా జ్యూరీ నుండి అందుకున్నారు)
యూనిక్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు 2018
(బెటర్ శ్రీకాకుళం ఫోరమ్ నుండి)
ఛాంపియన్స్ అవార్డ్ 2018 మార్పు
(NITI అయోగ్/భారత ఉపాధ్యక్షుడు నుండి స్వీకరించారు)
ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అవార్డ్ 2019
(రక్షణ మంత్రి నుండి అందుకున్నారు)
సేవా మార్గం..
తితిలీ తుఫాను సమయంలో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం, దుస్తులు, ప్రాథమిక అవసరాల కోసం 1 లక్ష మందికి సాయం అందించారు. ఉత్తరాంధ్రలో యువతకి 10 లక్షలు ఉద్యోగాలను కల్పించడం ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఈ దిశగా స్కిల్ ట్రైనింగ్, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ నుంచి అంచెలంచెలుగా ఎదిగి..
ఆంధ్రా యూనివర్శిటీ , స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని సహచర శాస్త్రవేత్తలు, స్నేహితులు ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో, డాక్టర్ శ్రీనుబాబు గేదెల ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌ని ప్రారంభించారు. పరిశోధకులకు ఆరోగ్య సంరక్షణ, వైజ్ఞానిక సమాచారాన్ని ఉచితంగా అందుబాటులో ఉంచారు. సహ విద్యార్థులు, శాస్త్రవేత్తల ఇబ్బందులు ద్రుష్టిలో ఉంచుకుని ఏదైనా విద్యాసంబంధమైన ,పరిశోధన అవసరాల కోసం సమాచారాన్ని ఉచితంగా ఇవ్వడానికి 'ఓపెన్ యాక్సెస్' మిషన్ ఆరంభించారు. ప్రస్తుతానికి Omics ఇంటర్నేషనల్ హైదరాబాద్, చెన్నై మరియు ఢిల్లీలలో 5000+ ఉద్యోగులతో (75% మహిళా ఉద్యోగులు) ఆరు ప్రత్యేక ఆర్థిక మండలి యూనిట్లలో పనిచేస్తోంది. విస్తరణలో భాగంగా ఓమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిషింగ్ , ఈవెంట్స్ రంగంలో అనేక చిన్న మరియు మధ్య తరహా కంపెనీలను కొనుగోలు చేసింది. ఈ కంపెనీలు ప్రధానంగా యూరప్, కెనడా, యునైటెడ్ స్టేట్స్, రష్యా దేశాలకి చెందినవి.
Omics International Pvt Ltd అనేది ఎప్పటికప్పుడు విస్తరిస్తున్న పబ్లిషింగ్ గ్రూప్, ఇది క్లినికల్, మెడికల్, ఇంజనీరింగ్ & టెక్నాలజీ, మేనేజ్‌మెంట్ మరియు లైఫ్ సైన్సెస్ రంగాలలో 1000 సైంటిఫిక్ మరియు హెల్త్ కేర్ జర్నల్స్ ప్రచురిస్తోంది. ఇది ఏటా 50,000 శాస్త్రీయ పరిశోధన కథనాలను ప్రచురిస్తుంది. కేవలం ప్రచురణకు మాత్రమే పరిమితం కాకుండా, డా. శ్రీనుబాబు గేదెల అంతర్జాతీయ సమావేశాలు కార్యక్రమాల నిర్వహణ వరకూ విస్తరించారు. 40 దేశాలలో 3000+ కంటే ఎక్కువ గ్లోబల్ వార్షిక వైద్య మరియు శాస్త్రీయ సమావేశాలతో, Omics అంతర్జాతీయ సమావేశాలు 60,000+ శాస్త్రవేత్తలకు అర్ధవంతమైన పరస్పర చర్య మరియు చర్చల కోసం వేదికగా ఉంటాయి, ఇక్కడ ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు మరియు వ్యాపార నిపుణులు యువ మరియు ఔత్సాహిక పండితులతో వారి జ్ఞానాన్ని ఉద్దేశించి చర్చించారు.
పల్సస్ ఒక బహుళజాతి సంస్థ
పల్సస్ 1984లో స్థాపించబడింది. దీని కార్యకలాపాలు ప్రస్తుతం లండన్, సింగపూర్, చెన్నై, గుర్గావ్ , హైదరాబాద్‌ల నుండి పనిచేస్తోంది. పల్సస్ ద్వారా హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, మెడికల్ పబ్లిషింగ్ మరియు ఫార్మాకోవిజిలెన్స్ సేవలను అందిస్తోంది. Omics International Pvt Ltd (OIPL) 2015 నుండి పల్సస్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. పల్సస్ ఇండియా కార్యకలాపాలు హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్, మెడికల్ పబ్లిషింగ్ మరియు ఫార్మాకోవిజిలెన్స్ రంగాలలో ఎగుమతి సేవలను చేస్తున్నాయి.
డాక్టర్ శ్రీనుబాబు గేదెల 25 సంవత్సరాల వయసులోనే ప్రపంచ ప్రసిద్ది గాంచిన స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టోరల్ మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయములో పీ,హెచ్ డీ సాధించారు. 2007 సంవత్సరములో డాక్టర్ శ్రీనుబాబు గేదెల దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హ్యూమన్ ప్రొటెయోమి సంస్థ నుండి యువ వైజ్ఞానిక అవార్డును అందుకున్నారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనల ఫలితాలను పరిశోధన గ్రంధములు మరియు సైన్స్ సమావేశాల ద్వారా ప్రపంచ వ్యాప్తముగా వ్యాపింప చేసే ఉద్దేశముతో ఒమిక్స్ మరియు పల్సస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను స్థాపించారు. విద్యార్థి దశలో పరిశోధన సాహిత్యాన్ని పొందడానికి ఎదుర్కొన్న పలు చేదు అనుభవాలు ఒమిక్స్ మరియు పల్సస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశోధన ప్రచురణల సంస్థలు స్థాపించడానికి ఆయనను ప్రేరేపించాయి. అనుక్షణము మారి పోతున్న వైజ్ఞానిక ఫలితాలను ప్రపంచ వ్యాప్తముగా విద్యార్థులు, మరియు పరిశోధకులందరికి అందించడమే ఈ సంస్థల ప్రధాన లక్ష్యం.
ప్రపంచ వ్యాప్తముగా విద్యార్థులు, పరిశోధకులు సమాచార సేకరణ కొరకు పలుకష్టాలకు ఓర్చి ప్రయత్నించినా, గ్రంధాలయములు అందరికి అందుబాటులో లేక సకాలంలో సమాచారము పొందలేక పోతున్నారు. పరిశోధనా ఫలితాలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల పరిశోధకులకు అందుబాటులో ఉండటంలేదు. ఈ పరిస్థితులలో ఆంధ్ర విశ్వవిద్యాలయం లో తన తోటి శాస్త్రవేత్తలు , స్నేహితుల ప్రోత్సాహముతో బాటు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం పండితుల ప్రోత్సాహంతో జర్నల్ అఫ్ ప్రొటెయోమిక్స్ బయోఇన్ఫర్మేటిక్స్ ఓపెన్ యాక్సెస్ అనే పరిశోధనా జర్నల్ను ప్రారంభించారు డా. శ్రీనుబాబు. ప్రారంభం నుండే ప్రోటీన్ఓమిక్స్ మరియు డయాబెటిస్ రంగంలో పరిశోధనల పై ఆసక్తి కలిగివున్న డా గేదెల తన సంస్థకు ఒమిక్స్ ఇంటర్నేషనల్ అని నామకరణము చేశారు.
ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (OIPL) పరిశోధనకు అనువుగా ఓపెన్ యాక్సెస్ వేదికను అందించే ఏకైక లక్ష్యంతో బాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క విభిన్న రంగాలకు సంబంధించిన సమాచారాన్ని రీసెర్చ్ పండితులు, విద్యార్ధులు, లైబ్రరీలు, విద్యా సంస్థలు, పరిశోధన కేంద్రాలు మరియు పరిశ్రమలకు ఇంటర్నెట్ ద్వారా ఉచితముగా అందేలా చేస్తోంది.
ప్రస్తుతం ఒమిక్స్ ఇంటర్నేషనల్ ఆరు స్పెషల్ ఎకనామిక్ జోన్ల నుండి 5000 కి పైగా ఉద్యోగులతో, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ కేంద్రముగా పనిచేస్తున్నది. వీరిలో 75% మంది మహిళాఉద్యోగులుండటం విశేషం. విస్తరణలో భాగంగా, అమేరికా, కెనడా మరియు యూరోపియన్ దేశాలకు చెందిన పలు చిన్న, మధ్యంతర ప్రచురణ మరియు సమావేశ నిర్వాహణా సంస్థలను ఒమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థ తన ఆధీనంలోకి తెచ్చుకున్నది.
ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ నిరంతరం వృద్ధి చెందుతూ, తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. ప్రస్తుతం ఒమిక్స్ సంస్థ 1000 కి పైగా ప్రచురణలు, మరియు 3000 కు పైగా జరిగే ప్రపంచ వ్యాప్త సైన్స్ సమావేశాల తో క్లినికల్, మెడికల్, ఫార్మాస్యూటికల్, ఇంజనీరింగ్ టెక్నాలజీకి చెందిన సమస్త సమాచారాన్ని అందరికి ఉచితముగా అందుబాటులో ఉంచింది. సాలీనా, ఒమిక్స్ 50,000 కు పైగా పరిశోధనా వ్యాసాలు ప్రచురిస్తూ, ప్రపంచ వ్యాప్తముగా, 60, 000 కు పైగా శాస్త్రవేత్తలను తన సమావేశాల ద్వారా ఒకే వేదికపై తెస్తూ, శాస్త్ర, సాంకేతిక పరిశోధనా ఫలితాలను చర్చిస్తూ, సమాచార మార్పిడికి దోహదం చేస్తున్నది. తన సమావేశాల ద్వారా వ్యాపార, వాణిజ్య, సాంకేతిక నిపుణుఁలతో పాటు, యువశాస్త్రవేత్తలను, విద్యార్థులను ఒకే వేదికపై చేర్చి కొత్త పరిశోధనలకు శ్రీకారం చుడుతున్నది ఒమిక్స్.
పల్సస్ హెల్త్ టెక్ మరియు పల్సస్ 1984 లో స్థాపించబడిన ఒక మల్టీనేషనల్ సంస్థ. ఇది ప్రస్తుతం లండన్, సింగపూర్ , చెన్నై, గురుగావ్ మరియు హైదరాబాదు కేంద్రముగా, హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫోర్మాటిక్స్, ఫార్మకోవిజిలెన్స్, మరియు మెడికల్ పబ్లిషింగ్ రంగాలలో తన సేవలు అందిస్తున్నది. 2015 సంవత్సరం నుండి ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు పల్సస్ సంస్థలు సంయుక్తంగా హెల్త్ టెక్, హెల్త్ ఇన్ఫోర్మాటిక్స్, బయో ఇన్ఫోర్మాటిక్స్ మరియు మెడికల్ పబ్లిషింగ్ రంగాలకు సంబంధించి పలు వస్తువులు మరియు సేవలను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
లక్ష్యం: పరిశోధనలో భాష అడ్డంకులను తొలగించడం. ఉచితంగా, ప్రజలు ఇష్టపడే వారి భాషలో ప్రపంచం యొక్క నలుమూలలా ఆరోగ్య మరియు శాస్త్రీయ సమాచారం అందుబాటులో ఉంచడం.
డాక్టర్ శ్రీనుబాబు గేదెల యొక్క సైంటిఫిక్ h-ఇండెక్స్ 12 మరియు గూగుల్ స్కాలర్ ప్రకారం i10-ఇండెక్స్ 15
వార్తలు లింకులు
డాక్టర్ శ్రీనుబాబు గేదెల ప్రత్యేక గ్లోబల్ లీడర్ అవార్డు
డాక్టర్ శ్రీనుబాబు గేదెల CEO అవార్డు
పరిశ్రమల వ్యవస్థాపకుడిగా డా. శ్రీనుబాబు గేదెల చేసిన ప్రసంగం - 'ఆహార సంబందిత పరిశ్రమలదే భవిష్యత్తు'.
యూరప్ లో పల్సస్
ఐరోపాకు విస్తరించిన పల్సస్ వివిధ సైంటిఫిక్ సొసైటీలతో భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంది. పల్సస్
కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి, శ్రీ సురేష్ ప్రభు, 2018 మార్చిలో, చెన్నైలో పల్సస్ కార్యాలయం ప్రారంభించారు.
https://timesofindia.indiatimes.com/business/india-business/pulsus-opens-healthcare-informatics-pharmacovigilance-facility-in-chennai/articleshow/63236743.cms
హైదరాబాద్ లో ఐటి / ఐటీఈఎస్ క్యాంపస్
http://www.thehindubusinessline.com/news/scientific-publisher-omics-scripts-major-expansion-plans-1000cr-investment/article10035789.ece
విశాఖపట్నంలో నైపుణ్య అభివృద్ధి క్యాంపస్
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/health-informatics-unit-likely-to-come-up-in-it-sez/article20745647.ece
డాక్టర్ శ్రీనుబాబు గురించి
https://telanganatoday.com/making-wealth-out-of-science
https://www.wisdomjobs.com/spark-of-corporate/307-dr-dot-srinubabu-gedela-05-06-2017.html
https://www.bloomberg.com/news/features/2017-08-29/medical-journals-have-a-fake-news-problem
http://www.thehindu.com/news/cities/Visakhapatnam/chanting-success-mantra-scientific-way/article8319221.ece
భాష ఇకపై పరిశోధనలకు అవరోధం కాదు
https://www.prnewswire.com/news-releases/language-is-no-longer-barrier-for-research-open-access-journals-disrupting-the-english-dominance-in-scientific-literature-300590935.html
నోయిడాకు విస్తరణ
http://www.thehansindia.com/posts/index/Business/1970-01-01/Pulsus-Group-invests-in-UP/360715
https://economictimes.indiatimes.com/industry/services/education/e-education-firm-pulsus-to-invest-rs-500-cr-in-up/articleshow/63066607.cms
https://telanganatoday.com/pulsus-plans-to-buy-two-firms
రక్తదాన శిబిరాలు
https://telanganatoday.com/500-omics-employees-donate-blood-in-hyderabad
మహిళా సాధికార కార్యక్రమాలు
https://www.entrepreneur.com/article/308879
ఆసియా బయోటెక్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవి
https://www.biospectrumasia.com/news/49/6188/srinubabu-gedela-is-faba-vice-president.html
ఇండియన్ ఏంజెల్స్ మరియు హైదరాబాద్ ఏంజిల్స్ సభ్యులు ఇండియన్ స్టార్టప్లకు మద్దతు ఇచ్చారు.
https://www.indianangelnetwork.com/individual-members/srinubabu_gedela_der/
http://www.hyderabadangels.in/srinubabu-gedela.html
ఈనాడు- తెలుగు డైలీలో వ్యాసం
http://www.eenadu.net/special-pages/etharam/etharam-inner.aspx?catfullstory=19290
ఆంధ్రజ్యోతి తెలుగు డైలీ లో వ్యాసం
డాక్టర్ శ్రీనుబాబు
సాక్షి తెలుగు డైలీ లో వ్యాసం
డాక్టర్ శ్రీనుబాబు గేదెల వ్యాపారం స్టోరీ సాక్షి తెలుగు
టీవీ న్యూస్ ఇంటర్వూస్ మరియు ప్రాంతీయ భాషల లో ఇంటర్వ్యూలు
https://www.youtube.com/watch?v=7cEGJewpod4
https://www.youtube.com/watch?v=sShBa5pLfZU
https://www.youtube.com/watch?v=-qF6yeJHw3w
https://www.youtube.com/watch?v=vxW3M1M-O0I&t=49s
https://www.youtube.com/watch?v=Hyk8f6HQE1s
https://www.youtube.com/watch?v=oj8ykotAL4c
డాక్టర్ శ్రీనుబాబు గేదెల గురించి 10 టివి లో
డాక్టర్ శ్రీనుబాబు డాక్యుమెంటరీ
‘వెల్త్ క్రియేటర్స్’ అనే అంశంపై డాక్టర్ శ్రీనుబాబు గేదెల తో HMTV లో ముఖాముఖీ
పల్సస్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు గేదెల పై సాక్షి టెలివిజన్ లో వార్త ప్రసారం
డాక్టర్ శ్రీనుబాబు గేదెల
విల్లా నం. 87, విల్లా గ్రీన్స్
కోకాపెట్టా, గండిపేట రోడ్
హైదరాబాద్ 500075 TS
91-40-33432400 / 01/02
ceo@pulsus.com
డాక్టర్ శ్రీనుబాబు గేదెల ఫేస్ బుక్ ఖాతా
డాక్టర్ శ్రీనుబాబు గేదెల లింక్డ్ఇన్ ఖాతా
డాక్టర్ శ్రీనుబాబు గేదెల ట్విట్టర్ ఖాతా
కొనుగోళ్లు
2016 వ సంవత్సరంలో ఉత్తర అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందిన, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన పల్సస్ సంస్థను కొనుగోలు చేసిన తరువాత ఆ సంస్థ ప్రచురించే అన్ని పరిశోధనా జర్నల్స్ ఒమిక్స్ యాజమాన్యం కిందికి వచ్చాయి. హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ రంగంలో నాణ్యతగల పరిశోధనలను అందించే సంస్థగా ప్రచురణారంగ మార్కెట్లో పల్సస్ ను వృద్ధి చేయాలనే ఆసక్తితో డా. గేదెల కృషిచేస్తున్నారు. పల్సస్ మాతృ సంస్థ ఈ కొనుగోలుతో 3500 మందికి ఉఫాధిని కల్పిస్తూ, హైదరాబాద్, చెన్నై, మరియు న్యూఢిల్లీలలో తన కార్యకలాపాలను విస్తరించింది.
భవిష్యత్ ప్రణాళికలు
2020 నాటికి డా. శ్రీనుబాబు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణము తో తన కార్యాలయాలను విస్తరించి, హైదెరాబాదు కేంద్రంలో 5000 మందికి చెన్నై, గురుగ్రామ్, నోయిడా ఇంకా విశాఖపట్నం కేంద్రాలలో మరో 5000 మందికి ఉపాధి కల్పించాలని ప్రణాళికలు చేస్తున్నారు.
సామాజిక భాద్యత మరియు ఆసక్తులు
శ్రీనుబాబు గేదెల తన సొంత పట్టణంలో 5000 మంది విద్యార్థులకు ప్రాథమిక విద్య మొదలుకొని, ఉన్నత పాఠశాల, జూనియర్ కాలెజీ, డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తున్నారు.
డాక్టర్ శ్రీనుబాబు పెట్టుబడిదారుడు కూడా. ఇండియన్ ఏంజెల్ నెట్ వర్క్స్, హైదరాబాద్ ఏంజిల్స్ మరియు న్యూయార్క్ ఈక్విటీ ఫోరమ్స్ ద్వారా అనేక సంస్థలలో ఆయన పెట్టుబడులు పెట్టారు.
డాక్టర్ శ్రీనుబాబు దత్తత తీసుకున్న గ్రామాలలో నీటిని శుభ్రపరచడానికి మరియు డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగు పరిచేందుకు కృషి చేశారు . గ్రంధాలయాలు, ఆలయాలు నిర్మించడానికి డబ్బు విరాళంగా ఇచ్చా రు.
సీరియల్ వ్యవస్థాపకుడు కెనడాకు చెందిన హెల్త్కేర్ మరియు మెడికల్ ఇన్ఫర్మేటిక్స్ సంస్థ పల్సస్ను కొనుగోలు చేస్తాడు
మరింత చదవండిహైదరాబాద్ ప్రధాన కేంద్రం గా పనిచేస్తున్న పల్సస్ సంస్థ ఈ బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని నోయిడా లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొని ఆ రాష్ట్ర ప్రభుత్వం తో ఒక కీలక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భం లో పల్సస్ సంస్థ అధినేత, మరియు సీఈఓ డా. శ్రీనుబాబు గేదెల మాట్లాడుతూ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమును వివిధ ప్రపంచ భాషలలో తర్జుమా చేసే కేంద్రాన్ని 1000 మంది ఉద్యోగులతో ఇక్కడ స్థాపించనున్నట్లు పేర్కొన్నారు.
మరింత చదవండిఓపెన్ యాక్సెస్ సైంటిఫిక్ జర్నల్స్ మరియు ఒమిక్స్ ఇంటర్నేషనల్ స్థాపకుడు, సీఈఓ, డాక్టర్ శ్రీనుబాబు ‘యంగ్ ఎంట్రప్రెన్యూర్ బిజినెస్ ఎక్సలెన్స్ పురస్కారం’ అందుకున్నారు.
మరింత చదవండినోయిడా లో పల్సస్ హెల్త్ కేర్ మరియు లాంగ్వేజ్ ట్రాన్సలేషన్ కేంద్రం ప్రారంభం
మరింత చదవండిసైంటిఫిక్ ప్రచురణకర్త ఓమిక్స్ స్క్రిప్ట్స్ ప్రధాన విస్తరణ; 1,000 కోట్ల పెట్టుబడులు
మరింత చదవండిసంపద సృష్టికర్తలు: ఒమిక్స్ సంస్థ అధినేత, డా. శ్రీనుబాబు గేదెలతో HMటీవీ లో 'సంపదను పెపొందిచే నూతన మార్గాలపై' ప్రత్యేక ముఖాముఖీ
మరింత చదవండిడాక్టర్ శ్రీనుబాబు గేదెల తన వ్యాపారాన్ని హైదరాబాదులోని రాయదుర్గంలో గల ప్రత్యేక ఆర్థిక మండలిలో 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణము గల కార్యాలయంలో నిర్వహిస్తూ, భారతదేశంలో లోనే కాకుండా విదేశాలలో కూడా తన వ్యాపారాలను విస్తరించాలని యోచిస్తున్నారు.
మరింత చదవండిహైదరాబాద్: ఓమిక్స్ ఇంటర్నేషనల్ తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా థాలసీమియా రోగులకు రక్తదాన కార్యక్రమాలను నిర్వహించింది. ఓమిక్స్ ఇంటర్నేషనల్ నుండి 500 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై రక్తం విరాళంగా ఇచ్చారు.
మరింత చదవండిఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని నోయిడా లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో పల్సస్ సీఈఓ శ్రీనుబాబు గేదెల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పాల్గొన్నారు.
మరింత చదవండిఒమిక్స్ మరియు పల్సస్ సంస్థల అధ్యక్షుడు ,ముఖ్య కార్యనిర్వాహణాధికారి డా. శ్రీనుబాబు గేదెల భారతదేశం లో మహిళాకార్మికుల సుదీర్ఘ చరిత్రను నిర్వచిస్తూ, “ భారతదేశం లో మహిళ శ్రామికులు ప్రస్తుతం అనేక మార్పుల లోనవుతూ, ఒక సంధి కాలం లో ఉన్నారు. వారు ఎక్కువశాతం వ్యవసాయ లేక అనుబంధ శాఖల తో పాటు, చిన్న తరహా పరిశ్రమల లో పనిచేస్తున్నారు. పాక్షిక నైపుణ్యం కలిగిన పరిశ్రమలు తక్కువ ఉత్పాదక శక్తి కలిగి ఉండటం వల్ల తక్కువ వేతనం పొందుతున్నారు. అధిక సంఖ్య లో మహిళలు అసంఘటిత రంగం లో పనిచేస్తున్నందున వారు అనేక సదుపాయాలు పొందలేక పోతున్నారు”.
మరింత చదవండిస్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పోస్ట్ డాక్టరేట్ డిగ్రీ పొంది, ఒమిక్స్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించిన డాక్టర్ శ్రీనుబాబు, ఇప్పటికే స్థాపించబడిన పాఠశాలలను కొనుగోలు చేసి ఆధునిక సాంకేతిక పద్ధతుల నుపయోగించి ఆడియో/విజువల్ మరియు ఇతర భోదనా పద్ధతుల ద్వారా విద్యాభివృద్ధి కి తోడ్పడుతున్నారు.
మరింత చదవండిశాస్త్ర, సాంకేతిక వైద్య రంగాలలో జరిగే పరిశోధనలను ప్రచురణలు మరియు సైన్సు సమావేశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందించేందుకు నిరంతర కృషి చేస్తున్న ఒమిక్స్ ఇంటర్నేషనల్ సేవలనుగా 2016 హైదరాబాద్ సాఫ్ట్ వేరే ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ (HYSA) ఉత్తమ ITES కంపెనీ 2016 అవార్డుకి ఎంపికైంది.
2014-15 సంవత్సరానికి గాను "ఉత్తమ ITES అవార్డ్ " ప్రదానోత్సవం మార్చ్31 న హైదరాబాద్ లోని HICC లో జరిగింది. ఒమిక్స్ ఇంటర్నేషనల్ తోబాటు CA (భారతదేశం) టెక్నాలజీస్, HSBC సాఫ్ట్ వేర్ అభివృద్ధి సంస్థ (ఇండియా) ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, డీప్సీ టెక్నాలజీస్, CGK టెక్నాలజీస్ సంస్థలు ఇతర విభాగాలలో అవార్డులు గెలుచుకున్నాయి.
ఈ కార్యక్రమంలో 150 కంటే ఎక్కువ ప్రారంభ సంస్థలు, 150 కంటే ఎక్కువ ఐటీ పరిశ్రమల అధినేతలు, 1000 కంటే ఎక్కువమంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఐటి ప్రధాన సంస్థల CEO లు మరియు ప్రముఖ ప్రారంభ సంస్థల అధినేతల ప్రధాన ఉపన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అవార్డులు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు పంచాయత్ రాజ్ కేబినెట్ మంత్రి గౌరవనీయులు శ్రీ కె.టి.రామారావు చేతులమీదుగా ప్రదానం చేయబడ్డాయి.
మరింత చదవండి2007 సంవత్సరము లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఆసియా ఓషియానియా హ్యూమన్ ప్రొటెయోమి సంస్థ (AOHUPO) నుండి యువ వైజ్ఞానిక శాస్త్రవేత్త అవార్డుకై ఆంద్ర విశ్వవిద్యాలం లోని పరిశోధక విద్యార్థి డా. శ్రీనుబాబు గేదెల ఎంపికయ్యారు.
మరింత చదవండిఓమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఇండస్ ఫౌండేషన్, మరియు తెలంగాణ ప్రభుత్వం తో కలిసి సంయుక్తంగా 2014 వ సంవత్సరం లో గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
మరింత చదవండిఒమిక్స్ మరియు పల్సస్ సంస్థల సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. శ్రీనుబాబు గేదెలను ను ఆంధ్ర విశ్వవిద్యాలయం లో జరిగిన ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ మరియు బయోడైవర్సిటీ అంతర్జాతీయ సదస్సు సందర్భము గా సత్కరించారు.
మరింత చదవండిఓమిక్స్ ఇంటర్నేషనల్ యొక్క 8 వ వార్షికోత్సవం
మరింత చదవండివైద్య సేవల ధరలు ఆకాశాన్నంటుతు సామాన్యులకు అందుబాటులో లేవని రాష్ట్ర గవర్నర్ అభిప్రాయపడ్డారు. వైద్య రంగం లో పలు సేవలు అందిస్తున్న ఉత్పత్తిదారులు, పాలకులు, వైద్యులు, వైద్యసేవనందించే సిబ్బంది, ఇంసూరెన్సు సంస్థలు, మరియు వైద్య విద్య బోధించే సంస్థలు, అందరు కలిసి సంయుక్తంగా పనిచేస్తేనే ఈరంగం లో సమగ్రాభివృద్ధి జరుగుతుందని, ఫలితముగా, వైద్యసేవలు అన్ని వర్గాలవారికి అందుబాటులో ఉంటాయని ఒమిక్స్ ఇంటర్నేషనల్ మరియు పల్సస్ సంస్థల సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు.
మరింత చదవండి“విశాఖపట్నంలో నేను విద్యార్ధిగా ఉన్నప్పుడు అధునాతన పరిశోధనా జర్నల్స్ ని సేకరించడంలో పొందిన వైఫల్యమే ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ మరియు శాస్త్రీయ సమావేశాలు ప్రోత్సహించే దిశగా నన్ను ప్రేరేపించాయి” - డా. శ్రీనుబాబు.
మరింత చదవండివివిధ కార్పొరేట్ కంపెనీల నుండి 5,000 మందికి పైగా సైక్లింగ్ ఔత్సాహికులు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్, మాదాపూర్ లో నిర్వహించిన కార్పొరేట్ సైక్లింగ్ కార్యక్రమం "ఫ్రీడం రైడ్ 2015" ఏడవ ఎడిషన్లో పాల్గొన్నారు. ది అట్లాంటా ఫౌండేషన్ (టిఎఎఫ్) నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒమిక్స్ ఇంటర్నేషనల్ సిఈఓ శ్రీనుబాబు, జైష్ రంజన్, తెలంగాణ ఐటి కార్యదర్శి భరణి కుమార్ , సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
మరింత చదవండి3వ ప్రపంచ బయోటెక్నాలజీ సదస్సు 2013 లో నిర్వహించబడింది.
మరింత చదవండిఇండస్ ఫౌండేషన్, ఓమిక్స్ ఇంటర్నేషనల్, TV9, మరియు తెలంగాణ ప్రభుత్వం తో కలిసి సంయుక్తంగా 2014 వ సంవత్సరం లో ఎడ్యుకేషనల్ సమ్మిట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
మరింత చదవండిఓమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థ 2012 వ సంవత్సరం లో హైదరాబాద్ లో ఫార్మా BA / BE కాన్ఫరెన్స్ ను నిర్వహించింది.
మరింత చదవండి