డాక్టర్.శ్రీనుబాబు గేదెల ఒక పురోగామిక యువ వ్యవస్థాపకుడు. ‘ప్రారంభ దశ లోనే డయాబెటీస్ ను గుర్తించడం ఎలా?’ అనే అంశం పై ఆయన చేసిన మార్గదర్శక అధ్యాయనం కోసం 2007లో కొరియాలోని సియోల్ లోగల ప్రతిష్టాత్మక ‘మానవ ప్రోటీయోమ్ సంస్థ’ నుండి యువ వైజ్ఞానిక అవార్డు అందుకున్నారు. 2007లో, 25 సంవత్సరాల వయసులోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి Ph.D పూర్తిచేసి, స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ డాక్టోరల్ సంపాదించారు. 2015 మరియు 2017 లో 'ఉత్తమ యంగ్ ఎంట్రప్రెన్యూర్ మరియు ప్రత్యేక గ్లోబల్ లీడర్' అవార్డులు అందుకున్నారు. ఆయన స్థాపించిన ఓమిక్స్ మరియు పల్సస్ సంస్థలు హైదరాబాద్, చెన్నై, ఢిల్లీలతో సహా ఆరు సెజ్ యూనిట్లలో, 5,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూన్నాయి, వాటిలో 75% మంది మహిళలే. వ్యాపారవిస్తరణలో భాగంగా పల్సస్, IT / ITeS, లైఫ్ సైన్సన్స్ క్యాంపస్లను స్థాపించింది. హైదరాబాద్, విశాఖపట్నం మరియు నోయిడాలో శాస్త్రీయ మరియు ఆరోగ్య సమాచార అనువాద కేంద్రాలు మరియు నైపుణ్యాభివృద్ధి క్యాంపస్ స్థాపించింది.
2009 లో ఓమిక్స్ ఇంటర్నేషనల్ సంస్థ స్థాపించడం ద్వారా తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించారు డా. గేదెల. శాస్త్ర సాహిత్యాన్నీ ఉచితంగా అందరికీ అందుబాటులో ఉంచడానికి విస్తృత దృష్టితో ఆలోచించి ఈ వేదికను ఏర్పాటు చేశారాయన. Ph.D చేస్తున్నప్పుడు డా. గేదెల పరిశోధనా సాహిత్యాన్ని పొందడానికి ఎదుర్కొన్న కస్టాలు మరియు అభివృద్ధిచెందుతున్న దేశాల పరిశోధకులు పడుతున్న ఇబ్బందుల నుండి ఆయనకు స్ఫూరించిన ఒక ఆలోచనే ఒమిక్స్ ప్రారంభానికి దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రచురణకర్తలు శాస్త్రీయ పరిశోధనా సాహిత్యాన్ని నియంత్రించడం వల్లనే వైజ్ఞానిక సమాచారం అందరికి అందడంలేదు. దీనిని నివారించే ఒక ప్రయత్నమే ఒమిక్స్. 2009లో ప్రారంభమైన ఒమిక్స్ క్లినికల్, మెడికల్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ మరియు లైఫ్ సైన్సెస్ విభాగాలలో 1000 పైగా శాస్త్రీయ హెల్త్ జర్నల్స్ నిర్వహిస్తూ, వీటి ద్వారా సంవత్సరానికి 50,000 శాస్త్రీయ పరిశోధనా కథనాలను ప్రచురిస్తుంది.
వ్యాపార ప్రయాణం
డాక్టర్. శ్రీనుబాబు గేదెల డాక్టరల్ అధ్యయనాల పరిశోధనకు తగిన లిటరేచర్ సేకరించడానికి విశాఖపట్నం నుండి హైదరాబాదుకు(700 కిమీ) నెలలో ఒకసారి లేదా రెండునెలలలో ఒకసారి ప్రయాణం చేసేవారు.
2007లో దక్షిణకొరియాలో ఆయనకు ‘యంగ్ సైంటిస్ట్ అవార్డ్’ ప్రదానోత్సవం జరిగిన సందర్భం లో మాట్లాడుతూ, అభివృద్ధిచెందుతున్న దేశాలలో పరిశోధకులు శాస్త్రీయ సాహిత్యాన్ని సేకరించడానికి ఎదుర్కొనే సమస్యలను ఆయన ప్రస్తావించారు. సబ్స్క్రిప్షన్ ఆధారిత జర్నల్ల ఖర్చు చాలా ఎక్కువగా ఉందని, ఒక పరిశోధనా వ్యాసం చదవడానికి పరిశోధకులు 50 నుండి 57 డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని, సాహిత్యాన్ని పొందటానికి ఇంత పెద్ద మొత్తాన్ని అభివృద్ధిచెందుతున్న దేశాల పరిశోధకులు ఖర్చుచేయలేకపోవచ్చు అన్న వాదనను హ్యూమన్ ప్రోటీయోమ్ ఆర్గనైజేషన్ (HUPO) కమిటీకి బలంగా వినిపించారు డాక్టర్. శ్రీనుబాబు.
ఈ పరిస్థితిని అధిగమించడానికి HUPO సభ్యుల మద్దతుతో ‘ప్రోటీయోమిక్స్ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్’ ఓపెన్ యాక్సెస్ జర్నల్ ను " ప్రారంభించారు. HUPO నిర్వాహకకమిటీ సభ్యులలో అనేకులు సంపాదకబోర్డు సభ్యులుగా తమసేవలను అందించి, ఈ జర్నల్ అభివృద్ధికి తోడ్పడ్డారు.
స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల మద్దతుతో డాక్టర్ గేదెల తన పోస్ట్ డాక్టోరల్ విద్య కొరకు స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ఓపెన్ యాక్సెస్ జర్నల్ ను ప్రపంచంలోని వేలాది మంది శాస్త్రవేత్తలకు పరిచయం చేశారు. ఈ క్రమంలో ‘ఓపెన్ యాక్సెస్ జర్నల్ల్లు ‘ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని చాటుకున్నాయి. పాఠకుల సంఖ్య కూడా వందలు, వేలు దాటి, మిలియన్లకు పెరిగింది. ఒమిక్స్ ఇంటర్నేషనల్ తన కార్యకలాపాలను అంతర్జాతీయసదస్సులకు మరియు ఈవెంట్లకు విస్తరించింది. 40 దేశాలలో 3000కు పైగా ప్రపంచవ్యాప్త మెడికల్, క్లినికల్ ఫార్మాస్యూటికల్ మరియు శాస్త్రీయ వార్షికసమావేశాలతో 200,000 పైగా శాస్త్రవేత్తలతో అర్ధవంతమైన పరస్పర చర్చకు దోహదం చేస్తుంది. ఈ సమావేశాలలో, ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు మరియు వ్యాపారనిపుణులు తమ జ్ఞానాన్నియువ మరియు ఔత్సాహిక పరిశోధకులతో పంచుకోవడానికి మరియు అనుసందానానికి తోడ్పడుతున్నాయి.
గత 9 సంవత్సరాల్లో తాను సాధించిన అద్భుతమైన అభివృద్ధిలో భాగంగా, ప్రచురణ మరియు అంతర్జాతీయ సమావేశాలతో, అనేక దేశాలకు తన సేవలను విస్తరించిన ఒమిక్స్ యూరోప్, కెనడా, USA మరియు రష్యా దేశాలకు చెందిన పలు చిన్న మరియు మధ్యతరహా ప్రచురణా కంపెనీలను కొనుగోలుచేసింది. 2016లో డా.శ్రీనుబాబు, 30 ఏళ్ల చరిత్ర గల కెనడా దేశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ మరియు మెడికల్ సైంటిఫిక్ జర్నల్స్ ‘పల్సస్ గ్రూప్‘ ను స్వంతం చేసుకున్నారు. సైంటిఫిక్ సమాజానికి తన సేవల ను మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో డా.శ్రీనుబాబు ప్రస్తుతం గ్లోబల్ సైంటిఫిక్ లిటరేచర్ ను ఇంగ్లీష్ నుండి వివిధ జాతీయ మరియు అంతర్జాతీయ భాషల లో అనువదిస్తున్నారు . ఫలితంగా, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం విదేశీ భాష లైన జపనీస్, రష్యన్, చైనీస్, జర్మనీ భాషలతో బాటు హిందీ, తెలుగు, గుజరాతి, తమిళం, బెంగాలీ మొదలైన భారతీయభాషలలో కూడా లభ్యమౌతున్నది. ఈ ప్రక్రియ పూర్తయితే, భారత దేశం యావత్ ప్రపంచానికి విజ్ఞాన కేంద్రంగా అవతరిస్తుంది. ప్రజలు తమ స్థానిక భాషలలో హెల్త్ కేర్ సమాచారం సులభంగా పొందగలుగుతారు.
భవిష్యత్తు లక్ష్యాలు మరియు ప్రణాళికలు
పరిశోధనలో భాషాపరమైన అడ్డంకులను తొలగించడం. ప్రపంచంలోని నలుమూలలకు ఆరోగ్య మరియు శాస్త్రీయ సమాచారాన్ని వారి ప్రాధాన్య భాషలో అందుబాటులో ఉంచడానికి ఒమిక్స్ కృషి చేస్తుంది. KPMG/గూగుల్ నివేదికల ప్రకారం, 2020-21 సంవత్సరానికి 550 మిలియన్ల (55 కోట్ల) భారతదేశప్రజలు ఇంటర్నెట్ను శోధించడానికి స్థానికభాషలను ఉపయోగీస్తారని వెల్లడైంది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చడానికి డా. గేదెల బృందం గ్రేటర్ నోయిడాలో ఆరోగ్యసంరక్షణ మరియు వ్యవసాయ సమాచార అనువాదకేంద్రం ప్రారంభించింది. పైన చెప్పిన సమాచారం ప్రకారం భాషానువాదం మిలియన్ల మంది భారతీయులకు, ముఖ్యంగా రైతులకు కొత్త వ్యవసాయ పద్ధతులను అనుసరించి తమ పంటలు, తోటలు, ద్రాక్షతోటలు, పౌల్ట్రీ లేదా ఇతర పశువుల పెంపకంలో తమ పరిజ్ఞానాన్నిమెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. గ్రామీణ మరియు నగరాలలో నివసించే భారతీయులకు ఉచిత ఆరోగ్య పరిజ్ఞానం లభిస్తుంది. శాస్త్రీయ ఆరోగ్య సమాచారం గ్రామీణ భారతీయులకు అందించి, వారి ఆరోగ్యపరిస్థితులు మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
వ్యాపారంలక్ష్యం
రాబోయే 3 సంవత్సరాల్లో 550 మిలియన్ల భారతీయులు ప్రాంతీయభాషలలో మొబైల్ ఫోన్ ‘యాప్’ లు వినియోగిస్తారు.
స్థానిక బాషలను బలపరిచే విధంగా కొత్త టెక్నాలజీ రూపొందించడం ద్వారా భారతీయ బాషల సాధికారతను పెంపొందించవచ్చు.
ఇది ప్రాంతీయ మరియు స్థానిక భాషా పరిశ్రమల ఆన్ లైన్ మరియు ఆప్ లైన్ సామర్త్యాన్ని మిళితంచేస్తుంది, ఇది భాషల విలువను మరింతగా పెంచి, ప్రపంచ మార్కెట్ లో స్థానిక భాషలలో సమాచారం విలువను 10 బిలియన్ల డాలర్లకు పెంచుతుంది.
2020 నాటికి డిజిటల్ ప్రకటనల విలువ $ 1.5 బిలియన్లకు చేరుకుంటుంది
మీడియాపరిశ్రమ
ఆప్ లైన్ ట్రాఫిక్ అడ్వర్టైజింగ్ పరిశ్రమ దృష్టిని ఆకర్షిస్తుంది.
బ్రాండింగ్ సేవలు
గుర్తింపు మరియు విలువ అధారిత వస్తుసేవలను మెరుగుపరచడం
వ్యవస్థాపకతను ప్రోత్సహించడం
ప్రాంతీయ భాషా వినియోగదారులకు అనుకూలంగా ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా సేవలు సేవలు అందించడం
ప్రాంతీయ భాషాలలో డిజిటల్ సమాచారం వాడుక పెరుగుదల సృజనాత్మకరంగ అభివృద్దికి తోడ్పడుతుంది.
జీవశాస్త్ర మరియు ఫార్మాస్యూటికల్ సైన్స్ నైపుణ్యాభివృద్ధి క్యాంపస్ స్థాపించడం.
యువతలో దాగిఉన్న ప్రతిభను నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా మెరుగుపరచి వారి ఉదోగావకాశాలు విస్తృతం చేయడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే జీవశాస్త్ర మరియు ఫార్మాస్యూటికల్ సైన్స్ నైపుణ్యాభివృద్ధి క్యాంపస్ ముఖ్య ఉద్దేశం. ఇది యువతలో నైపుణ్యతను పెంచి వృత్తిపరంగా ఉత్పాదకతను పెంచుతుంది.
నేడు భారతదేశ జనాభాలో 65% మంది పనిచేస్తున్న వయస్సులోఉన్నారు. వీరిని ప్రయోజకులుగా, ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయాలంటే వారిలోని నైపుణ్యాలను మెరుగుపరచి, సంపాదనాపరులుగా మార్చడం ఒక్కటే మార్గం. ఇది వారి వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి కూడా దోహాదపడుతుంది.
లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మసీ విద్యార్థులు ఆచరణాత్మక జ్ఞానం లేకుండా కళాశాల లేదా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేస్తున్నారు . పరిశ్రమల రంగంలో కొత్తగా వృద్ధి చెందుతున్న ఉత్పత్తులు ఇంకా సేవలను వినియోగదారులకు అందించాలంటే వీరికి తగిన వృత్తి మరియు వ్యాపార సంబంధిత శిక్షణ అవసరం. ఈ అవరోధాలను అధిగమించి యువతలో నైపుణ్యం అభివృద్ధి చేయటానికై పల్సస్ గ్రూప్ సంస్థలు భారతదేశంలో లైఫ్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు స్థాపించింది. పల్సస్ మరియు ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రవేట్ లిమిటెడ్ మరియు దాని సహవ్యవస్థాపక సంస్థలు ఆరు ప్రత్యేక ఆర్థిక మండళ్ళ (సెజ్) నుండి పనిచేస్తూ, 5000కు పైగా ఉద్యోగులతో, 40 దేశాలలో శాస్త్రీయ, వ్యవసాయ మరియు ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తున్నాయి.
పురస్కారాలు
అక్టోబర్ 9, 2007 లోదక్షిణకొరియాలోని సియోల్ లో HUPO నుండి యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకున్నడా. గేదెల.
2015 లో HYSEA నుండి ఉత్తమ భారతీయ ITES అవార్డు అందుకున్న ఒమిక్స్ ఇంటర్నేషనల్ ప్రవేట్ లిమిటెడ్.
2017 లో ఉత్తమ యంగ్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు అందుకున్న డాక్టర్ శ్రీనుబాబు గేదెల.
2017 లో డాక్టర్ శ్రీనుబాబు గేదెలకు ప్రత్యేక ప్రత్యేక గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ లభించింది.
సోషల్ మీడియా కాంటాక్ట్స్:
ఫేస్ బుక్ లో డా. శ్రీనుబాబు గేదెల
లింక్డ్ ఇన్ లో డా. శ్రీనుబాబు గేదెల
ట్వీటర్ లో డా. శ్రీనుబాబు గేదెల