సింగనమల భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఒక గ్రామం. ఇది అనంతపురం రెవిన్యూ విభాగంలో సింగనమల మండల్ యొక్క మండల ప్రధాన కార్యాలయం
జనాభా
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1165 ఇళ్లతో, 4986 జనాభాతో 3173 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2437, ఆడవారి సంఖ్య 2549. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 795 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 39.
సమస్యలు
- త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలి
- డ్రైనేజీ సమస్య
- సింగనమల చెరువు పూర్తిచేయాలి
- పరిశ్రమలు తెపిస్తాము అని చెప్పారు కానీ ఒక పరిశ్రమ కూడా తెలేదు
- సీసీ రోడ్లు వేయాలి
- ఎన్నిరోజులు అయినా కనీస రోడ్ రవాణా సదుపాయం కూడా లేకుండా ఉంటున్నాము అని ప్రజలు వాపోతున్నారు
- మిడ్ పెన్నార్ నుంచి వాటర్ తెచ్చి సింగనమల చెరువు నింపుతామని హామీఇచ్చిన ప్రభుత్వం ఇపుడు దాని వేపుకూడా చూడట్లేదు
వ్యవసాయ పంటలు
వరి, మామిడి