ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తాడిపత్రి నియోజకవర్గం

తాడిపత్రి, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఒక పట్టణం. ఇది అనంతపురం రెవిన్యూ విభాగంలోతాడిపత్రి  మండల యొక్క మండల ప్రధాన కార్యాలయం. ఇది కర్నూలు జిల్లా మరియు కడప జిల్లా సరిహద్దులో ఉంది. ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఉన్న పురాతన ప్రపంచ ప్రసిద్ధ చిన్తలా వెంకటరామన ఆలయం తదిపత్రీలో ఉంది. పండి నది గుండా 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న తదిపత్రి పట్టణం నుండి, బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఉంది, ఇది ఒక చిన్న వసంత నుండి నీటితో నిండిన ఒక వేదికపై కూర్చున్న లింగానికి గొప్పది.

జనాభా

2011 నాటి జనాభా లెక్కల ప్రకారం, తడిపత్రిలో 108,171 మంది జనాభా ఉన్నారు

చరిత్ర

విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతము, విజయనగర సామ్రాజ్యములో అంతర్భాగము. మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతము తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ వుంది.దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రము అనే పేరు కూడావుంది. పూర్వం ప్రాంతములో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని,తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల పేరువచ్చిందని కూడా అంటారు. క్రీ..1350 ప్రాంతములోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు అను బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశముతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఈప్రాంతమును అభివ్ళద్ది గావించెను. తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయం, శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయాలు చరిత్ర ప్రసిద్ధి గాంచిన ఆలయాలు. క్రీ..1460-1525 మధ్యలో నిర్మించబడ్డాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడైన తిమ్మానాయనిచే నిర్మాణమైనట్లు తాడిపత్రి కైఫీయత్ ద్వారా తెలుస్తున్నది. ఈరెండు దేవాలయాలు అద్భుత శిల్ప సంపదతోఅలరారుతూ చూపరులకు నయనానందాన్ని కలిగిస్తూ భక్తులను భక్తి పారవశ్యములో ముంచివేస్తూవుంటాయి. ఈరెండు ఆలయాలే గాకశ్రీ వాసవి కన్యక పరమెశ్వరి అమ్మవారి ఆలయము, శ్రీ కోదండరామ రంగనాధ స్వామి అళ్వారుల ఆలయం, వ్యాసరాయ ప్రతస్టిత అంజనేయస్వామి దేవస్థానము,శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయము, రాఘవేంద్రస్వామి ఆలయము, శ్రీ లలితా దేవి ఆలయము, శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయము, శిర్ది సాయి బాబా ఆలయము కూడా తాడిపత్రిలోగలవు. ఇక్కడికి సమీపంలో ఆలూరుకోనలో పురాతన ప్రాశస్తి కలిగిన రంగనాధఆలయం, ఓబుళేసు కోనఆలయాలు గలవు.

తాడిపత్రి అనంతపురం జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణము.ఇది చెన్నయి, ముంబై రైలు మార్గములో కడప, గుంతకల్ జంక్షన్ మధ్యన ఉంది. అనంతపురం నుంచి 55 కి.మీ,కడపనుంచి 104 కి.మీ,బెంగుళూరు నగరంనుంచి 250కి.మీ దూరంలో ఉంది.ఇక్కడ అనేక కడప బండల పాలిష్ ప్యాక్టరీలు, గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేకము ఉన్నాయి. ఇక్కడ పెన్నా సిమెంట్,అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు గలవు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా అనేకము ఉన్నాయి. ఇక్కడికి దాదాపు 25 కిలోమీటర్ల దూరములో ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు ఉన్నాయి. 10 కి.మీ. దూరంలో,హాజీవలీ దర్గా,15కి.మీ.దూరంలో పప్పూరు గ్రామంలో శ్రీ అశ్వర్ద నారాయణ స్వామి,భీమలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. తాడిపత్రి మండలంలో అల్ట్రాటెక్ సిమెంట్ (L&T)., పెన్నా సిమెంట్స్, SJK స్టీల్స్ (Gerdau steel Ltd) వంటి కర్మాగారాలున్నాయి. కడప రాతికి కూడా తాడిపత్రి ప్రసిద్ధం. పట్టణం పరిసర ప్రాంతాలలో సుమారు 600 గ్రానైట్ ప్రోసెసింగ్ పరిశ్రమలు మరియు నల్ల రాతి పొలిష్ పరిశ్రమలు 1000 దాకా ఉన్నాయి.

సమస్యలు

  • త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలి
  • అందేకళ్ళు ,చాగల్లు జలాశయం నీరు లేక ఎండిపోయి ప్రజలు బందిపోతున్నారు,దాని పూర్తిచేస్తాము అని చేపి అక్కడే ఆపేశారు
  • జే సి నాగిరెడ్డి త్రాగునీటి పథకాన్ని మొదలుపెట్టి మద్యలో ఆపేశారు
  • తాడిపత్రి మున్సిపాలిటీ కి త్రాగునీటి సమస్య చాలా వుంది
  • సీసీ రోడ్లు వేయించాలి
  • గండికోట,అవుకు జలాశయం కట్టిస్తాను అని కటించలేకపోయింది

వ్యవసాయ పంటలు

వేరుశెనగ, పొద్దుతిరుగుడు, బియ్యం, పత్తి, మొక్కజొన్న, మిరప, నువ్వులు, మరియు చెరకు.

Top