ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

అనపర్తి నియోజకవర్గం

రాజకీయంగా చైతన్యం కలిగిన నియోజకవర్గం అనపర్తి. పచ్చని పొలాలతో అందంగా ఉండే అనపర్తిలో ఒకప్పుడు స్మగుల్ చేయబడిన పరికరాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. క్రమంగా చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఎల్కేజీ నుండి, డీగ్రి, బీఇడీ, ఎమ్ సీ ఏ, ఎమ్ బీ ఏ, నర్సింగ్ వంటి కళాశాలలతో విద్యాకేంద్రంగా మారింది. ఇక్కడున్న కంటి ఆసుపత్రి కూడా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు కలిగి ఉంది. రైల్వేస్టేషను నుండి దేవి చౌక్‌వరకు వున్న ప్రాంతాన్ని కొత్తవూరు అని, కాలువ అవతల నుండి పొలమూరు వైపు వున్న ప్రాంతాన్ని పాతూరు అని పిలుస్తారు. దాదాపు ముపై ఏళ్ళ క్రితం పెంకుటిళ్ళు ఎక్కువగా వుండేవి. ప్రస్తుతం వాటిస్థానాల్లో డాబాలు, ఆపార్టుమెంట్లు వెలిశాయి. ప్రసిద్ద ఆలయాలు బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, మామిడాడ గ్రామంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి, శ్రీ కోదండ రామాలయాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అనపర్తిలో వీరుళ్ళమ్మ, బాపనమ్మ జాతరలు వైభవంగా జరుపుతారు. వారం రోజుల పాటు నిర్వహించే వీరుళ్ళమ్మ జాతర ప్రతి యేడు సంక్రాంతి సమయంలో నిర్వహిస్తారు. రోడ్డుకు ఇరువైపుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీరుళ్ళమ్మ జాతరకు అనపర్తి గ్రామ పరిసర గ్రామాల నుండి ప్రజలు వస్తారు. చివరిరోజున బాణసంచా కాలుస్తారు.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ద్విసభ నియోజకవర్గంగా కొనసాగింది. అనపర్తి నియోజకవర్గంలో 201498 మంది ఓటర్లు ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో రంగంపేట మండలాన్ని దీనిలో కలిపారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పెదపూడి, బిక్కవోలు, రంగంపేట, అనపర్తి మండలాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి విజయం సాధించారు.

నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఫైనాన్స్ వ్యాపారం, పౌల్ట్రీ, ఇతర రంగాల్లో అభివృద్ది చెందింది.  సుమారు 50 వేల జనాభా ఉన్న నియోజకవర్గ కేంద్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. జిల్లాలో రెండవ పెద్ద ప్రధాన రహదారి అయిన కెనాల్ రోడ్డు విస్తరణ పనులు అసంపుర్తిగా ఉన్నాయి. సుమారు 1600 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందచేయడం, మార్కండేయపురం వద్ద రైల్వే వంతెన నిర్మాణం, డంపింగ్ యార్డు ఏర్పాటు, పాలిటెక్నిక్ కళాశాల సౌకర్యాలు కల్పించడం, అనపర్తి రైల్వే స్టేషన్లో మరికొన్ని రైళ్లను ఆపాలని ఈ ప్రాంత ప్రజల కోరిక.

Top