కోనసీమలో వసిష్ఠ ,గౌతమి,గోదావరీ నదుల మధ్యలో ఉన్న పాత గన్నవరం నియోజకవర్గం,తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గంలో పి . గన్నవరం, అంబజీపేట, అయినవిల్లి, మడిదికుడురు మండలాలతో పాటు, మడిదికుడురులోని కొన్ని గ్రామాలు కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 1,80,080 మంది.
ఇక్కడ సర్ ఆర్ధన్ కాటన్ , బ్రిటిష్ కాలంలో గోదావరిపై నిర్మించిన ఆకీడెక్ట్ కు నేటికీ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంబాజిపేటలోని కొబ్బరి మార్కెట్ దేశవ్యాప్తంగా ఎగుమతులను అందిస్తుంది, ఇక్కడ తయారయ్యే కొబ్బరి నూనెకు మంచి గిరాకీ ఉంది.
అయినవిల్లి శ్రీ సిద్ది వినాయక స్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. స్వామివారికి నిత్యం గరికతో పూజలు నిర్వహించడం ఇక్కడ ప్రత్యేకత. కొబ్బరి కాయలో స్వయంబుగా వెలిసిన అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయం నియోజకవర్గంలోని మరో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం.
వరి, చెరకు, కొబ్బరి
బియ్యం, బెల్లం