ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

జగ్గంపేట నియోజకవర్గం

జగ్గంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో గోకవరం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాలు ఉన్నాయి. మొత్తం 192415 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం మొత్తం జనాభాలో 60 శాతం మంది కాపులు ఉంటారు. సహజంగానే ఇప్పటివరకు అందరూ శాశన సభ్యులు ఈ సామాజికవర్గానికి చెందిన వారే ఎన్నికయ్యారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరారు.

జగ్గంపేట నియోజకవర్గంలో కూలీలే ఎక్కువగా ఉంటారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో సాగునీటి సమస్య నెలకొని ఉంది. పుష్కర ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. దీన్ని పుర్తి చేస్తే సుమారు 10 వేల ఎకరాలకు నీరు అందించవచ్చు. రాజమండ్రి నుంచి జగ్గంపేట, గండేపల్లి మండలాల మీదుగా ఏలేరు రిజర్వాయర్ కు నీరు తరలిస్తున్నా ఈ ప్రాంతానికి మాత్రం నీరు అందడం లేదు. పోలవరం కాలువల కోసం భూములు ఇచ్చిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. బోర్ల కింద సాగు చేసుకుందామంటే కరెంట్ సరిగా ఉండటం లేదని, నాణ్యమైన విద్యుతు ఇస్తున్నామని అధికారులు చెప్తున్నా తమ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు.  నియోజకవర్గంలో 40 శాతానికి పైగా గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు లేవు. జగ్గంపేటలో మురికి కాలువలు ఆక్రమణకు గురై మురుగునీరు ఇళ్లలోకి చేరుతుంది. పోలవరం కాలువకు భూములు ఇచ్చిన రైతులకు, పేదలకు ఇంటి స్థలం కేటాయించాల్సి ఉంది. గోకవరం నుంచి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లాలంటే సిథిలావస్థలో ఉన్న ఇరుకు వంతెనే దిక్కు. నాలుగు లైన్లతో కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు చాలా రోజులుగా కోరుతున్నారు. ఇక్కడ మూడు పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండి. అత్యవసర సమయాల్లో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రికి వెళ్లాల్సి వస్తుంది.

Top