ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

మండపేట నియోజకవర్గం

మండపేట తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం మరియు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం. గతంలో ఇది ఆలమూరు నియోజకవర్గంలో ఉండగా 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మండపేట పేరుతో ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 1974లో రాజమండ్రి వద్ద నున్న గోదావరి నది మీద, రాజమండ్రి-కొవ్వూరులను కలుపుతూ రోడ్డు-రైలు వంతెన నిర్మించే వరకు చెన్నై, హైదరాబాద్, విజయవాడల నుండి వైజాగ్‌వైపు, కాకినాడ, రాజమండ్రిలకు వెళ్లు బస్సులను తణుకు మీదుగా రావులపాలెం బ్రీడ్జి మీదుగా మండపేట వచ్చి అక్కడినుండి రామచంద్రాపురం మీదుగా కాకినాడ, అన్నవరం, తుని, వైజాగ్‌, శ్రీకాకుళం, ఇచ్చ్హాపురం ప్రాంతాలకు వెళ్లెవి. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలకు మండపేట నుండే చాలా బస్సులు వెళ్లేవి. ప్రస్తుతం చాలా బస్సులు, ముఖ్యంగా తణుకు మీదుగా వెళ్ళు అన్ని ఎక్సుప్రెస్‌ బస్సులు మండపేట మీదుగానే వెళ్తున్నాయి. మండపేటలోని మెయిన్ రోడ్డు ఈ సెంటరు వద్ద 6 రోడ్లుగా చీలింది. ఒక రోడ్డు రావులపాలెం వైపు, మరో రోడ్డు ఏడిదవైపు, ఒకరోడ్డు వల్ల్లూరి వారి వీధికి, మరో రోడ్దు మర్కెట్‌కు ఒక రోడ్డు రామచంద్రపురం, మిగతా రెండు రోడ్లు వూరిలోని వీధులోకి ఉన్నాయి. మండపేట వ్యాపార లావాదేవీలకు బాగా ప్రసిద్ధి చెందింది. రైసు మిల్లులు, తవుడు నుండి నూనె తీయు ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి.

మండపేట అనే పేరు మండవ్యపురం అనే పేరుకి వికృతి. మాండవ్య ముని ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించడం వలన దీనికి ఆ పేరు స్థిరపడింది. సతీ సుమతి, గౌతముడు, యగ్నవల్కుడు, అగస్త్యుడు వంటి గొప్ప గొప్ప తపో సంపన్నులు భూమి ఇది. దీనికి నిదర్సంనంగా వాతపెస్వరం (తాపేశ్వరం), ఇల్వలపాడు (ఇప్పనపాడు) వంటి పల్లెలు కనిపిస్తాయి. మధ్యయుగాల్లో పావులూరి మల్లన వంటి గణిత శాస్త్ర కోవిదులు, తన దాతృత్వంనకు బ్రిటిష్ రాణి చేత ప్రశంసలందుకున్న డొక్కా సీతమ్మ గార్ల వంటి వారితోపాటు, బలుసు సాంబమూర్తి వంటి స్వతంత్ర యోధులు ఈ ప్రాంతానికి చెందినవారే.

నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుండగా, పెద్దసంఖ్యలో రైస్ మిల్లులు ప్రధానంగా కనిపిస్తాయి. కాజా స్వీట్ తయారీకి ప్రసిద్ది చెందిన తాపేశ్వరం గ్రామం ఈ నియోజకవర్గంలోనే ఉంది. వినాయకచవితి ఉత్సవాల సందర్భంగా తాపేశ్వరంలో తయారు చేసిన భారీ లడ్డూలను పలు చోట్లకు పంపే సాంప్రదాయం కొనసాగుతున్ది. అధికంగా పాల దిగుబడి ఇచ్చే మేలు జాతి పశువుల పెంపకంలో ఇక్కడి రైతులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. కపిలేశ్వరపురంలోని జమీందార్ కోట, వేద పాఠశాల, ఆంధ్రా శబరిమలైగా ప్రసిద్ది చెందిన ద్వారపూడి అయ్యప్ప దేవాలయం, వెదురుపాక పీఠం వంటి ప్రసిద్ది చెందిన ప్రదేశాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాలిటీతోపాటు మండపేట రూరల్, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలు ఉన్నాయి. మండపేట 1952లో నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు పామర్రు నియోజకవర్గంలో ఉండేది. ఆ తరువాత 1978లో నియోజకవర్గాల విభజనలో మండపేటను ఆలమూరులో చేర్చారు. తిరిగి 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆలమూరు నియోజకవర్గాన్ని రద్దు చేసి మండపేట నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గంలో 192276 మంది ఓటర్లు ఉన్నారు. కాపులు అత్యధికంగా ఉండగా బీసీలు, ఇతర ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల వారు ఉన్నారు.

నియోజకవర్గంలో యేటా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మద్దతు ధర ఒకటి. గోదావరి డెల్టాలో అత్యధికంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో మండపేట ఒకటి. ఇక్కడ 50 వరకు రైస్ మిల్లులు ఉన్నాయి. దగ్గర్లోనే రైస్ మిల్లులు ఉన్నా పండించిన పంటలకు మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండపేట చుట్టుపక్కల రైస్ మిల్లుల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు స్పందించటం లేదు. రబీ సీజన్లో సైతం మిల్లర్ల మాయాజాలంతో రైతులు నష్టపోతున్నారు. దీంతోపాటు ప్రభుత్వం నుంచి రైతులకు దక్కాల్సిన రవాణా ఖర్చుల్లో సైతం అక్రమాలు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. మండపేట రూరల్ ద్వారపూడి వద్ద రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇక్కడ రైల్వే గేటు వద్ద నిత్యం రైళ్ల రాకపోకలు, మరోవైపు పెద్దయెత్తున నిలిచిపోతున్న వాహనాల కారణంగా ఏదో రోజు ప్రమాదాలకు గురవుతామనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతుంది. తాపేశ్వరం వద్ద ఇరుకైన రహదారికి ప్రత్యామ్నాయంగా బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టాలి.

Top