తూర్పు గోదావరి జిల్లా లోని 19 శాసనసభ నియోజకవర్గాలలో, రాజమండ్రి గ్రామీణ శాసనసభ నియోజకవర్గం ఒకటి. గతంలో ఉన్న కడియం నియోజకవర్గానికి బదులుగా, 2009 శాసనసభల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసారు. రాజమహేంద్రవరం , తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక నగరం.
ఈ ప్రాంతానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. రాజమహేంద్రవరం ఆర్థిక, సాంఘిక, చారిత్రక మరియు రాజకీయ ప్రాముఖ్యత కలిగిన నగరం. అందువలన ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధాని అని కూడా అంటారు. ఈ ప్రాంతం, గతంలో రాజమండ్రి, రాజమహేంద్రి అని కూడా పిలువబడేది. సాహిత్యానికి రాజమహేంద్రవరం పుట్టినిల్లు. ఈ నగరంలోనే గొప్ప కవి, నన్నయ తెలుగు లిపిని కనుగొన్నాడు.