ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తుని నియోజకవర్గం

తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్ల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న తాండవ నది ఒడ్డున తుని ఉంది. తుని పట్టణము క్షత్రియులు, వైశ్యుల ద్వారా కొంతవరకు అభివృద్ధి చెందినది. తునిని పాలించిన రాజులు వత్సవాయి వంశానికి చెందిన క్షత్రియులు. ప్రసిద్ధ కవి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి కాశీ యాత్ర చేసుకుని తిరిగి వస్తూ 1890 ప్రాంతాలలో తునిలోని సత్రంలో ఆగినట్లు చెప్పుకుంటారు. తునిలో ప్రతి ఆదివారం జరిగే సంతకు ఏజన్సీ ప్రాంతాల నుండి చింతపండు, అడ్డాకులు, కుంకుడు కాయలు, సీకాయ, కొండచీపుళ్ళు మొదలైన వాటితో పాటు చెరకు బెల్లం, ఖద్దరు, తమలపాకులు, మామిడి పళ్ళు వస్తాయి. తునిలో దాదాపు 250 రకాల పళ్ళు దొరుకుతాయి. వీటిలో చెరకు రసం, పెద్ద రసాలు, చిన్న రసాలు, నూజివీడు రసాలు, పంచదార కలశ, నీలం, కోలంగోవ, ఏండ్రాసు, సువర్ణరేఖ, బంగినపల్లి, కలెక్టరు, జహంగీరు. మామిడి పళ్ళతో పాటు తుని నుండి బెల్లం, తమలపాకులు, చేనేత బట్టలు ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి.

తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో తుని ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. మొత్తం 1 లక్షా 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో తుని, కోట నందూరు, తొండంగి మండలాలు ఉన్నాయి. బీసీ ఓటర్లు 60 శాతం ఉండగా కాపులు 25 శాతం ఉన్నారు. మిగిలిన వారు 15 శాతం ఉన్నారు. 2014లో వైసీపీ అభ్యర్థి దారిశెట్టి రాజా టీడీపీ అభ్యర్థి యనమల కృష్ణుడుపై విజయం సాధించి శాశనసభ్యునిగా ఎన్నికయ్యారు. గతంలో రాజ వాత్సవయ వెంకట కృష్నమురజ్ బహదూర్, ఎన్ విజయలక్ష్మి, విజయలక్ష్మిదేవి మీర్జ నల్లపరాజు, యనమల రామకృష్ణుడు, వెంకత కృష్ణమ్రాజు, శ్రీ రాజ వత్సవాయిలు శాసన సభ్యులుగా పని చేశారు.

నియోజకవర్గం పరిధిలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. మురుగు కాలువలు శుభ్రం చేసి చాలా రోజులు అవుతుందని, వాటి పూడిక తీయించాలని స్థానికులు కోరుతున్నారు. నళ్లాల ద్వారా సరఫరా చేస్తున్న మంచి నీటిలో పురుగులు వస్తున్నాయి. వాటిని తాగి పిల్లలు రోగాలబారిన పడుతున్నారు. కనీసం ప్రజారోగ్యం, మంచినీటి సమస్యల పరిష్కారం వంటి వాటిపైనైనా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య తాండవ నదికి వరదలు వచ్చినప్పుడు ఆ నీరు ఇళ్లమీద పడి ముంపునకు గురవుతున్నాయి. ఆ ఇబ్బందులు తొలగించేందుకు నదికి రిటర్నింగ్ వాల్ కట్టించాల్సిన అవసరం ఉంది. తుని నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం, మార్కెట్ యార్డ్ విస్తరణ, తాగునీరు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఇక్కడున్న 220 హేచరీస్ లో 25 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దివీస్ కెమికల్ ఫ్యాక్టరీ కారణంగా మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్రంలోకి విష రసాయనాలను వదులుతుండటంతో తమ ఉపాధి దెబ్బతింటోందని మత్స్యకారులు వాపోతున్నారు.

Top