తాడికొండ నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి. కృష్ణా తీరం మరియు పచ్చని పొలాలతో ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ప్రాంతం ఇది. ఇది సమీప పట్టణమైన గుంటూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువ మొత్తంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 179080 గా నమోదయింది. అందులో ఆడవారి సంఖ్య 90721 కాగా మగవారి సంఖ్య 88351. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పత్తి మరియు మిర్చి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు.
శ్రీ గోగినేని నాగేశ్వరరావు గారు - గ్రామాభివృద్ధికి విశేషకృషి చేసిన ఈయన స్మరణార్ధం, తాడికొoడ శ్రీ గోగినేని కనకయ్య గాంధీ పార్కులో ఈయన శిలావిగ్రహం నిర్మించారు.