గుంటూరు జిల్లాలో గల 17 శాసనసభా నియోజకవర్గాలలో, తెనాలి ఒకటి. తెనాలికి, ప్యారిస్ నగరంలో వలే మెయిన్ రోడ్ కు రెండు వైపులా రెండు పెద్ద కాలువలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని "ఆంధ్రా ప్యారిస్" అని అంటారు. తెనాలి, గుంటూరు జిల్లాలో రెండవ పెద్ద పట్టణం. అలాగే ఈ ప్రాంతం, బంగారు నగల వ్యాపారానికి కూడా పేరుగాంచింది. బంగారపు వ్యాపారానికి ప్రొద్దుటూరు తర్వాత ఆంధ్ర ప్రదేశ్లో అంతటి ప్రాధాన్యత కలది ఈ ప్రాంతమే.
తెనాలి లోని మూడు కాలువల వలన తెనాలికి ఆ పేరు వచ్చింది. మూడు కాలువలను హిందీ భాషలో తీన్ నాల్ అంటారు. ఆ తీన్ నాల్ (తీన్నాల్) నే తర్వాత తెనాలి అన్నారు. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 239525. అందులో ఆడవారి సంఖ్య 122638 కాగా మగవారి సంఖ్య 116853 గా నమోదయింది. చెరకు, వరి, మామిడి ఈ ప్రాంతంలో ముఖ్యమైన పంటలు.
తెనాలి పట్టణం నడిబొడ్డున ఐదున్నర ఎకరాలలో విస్తరించియున్న "పినపాడు చెరువు" పట్టణానికి ఒక అద్భుతమైన సహజ వనరు. కేవలం చెరువుగా ఉంటే దీనికి ఇంత ప్రత్యేకత ఉండదు. అయితే చెరువుకు మధ్యలో సహజంగా ఉండే ద్వీపం (ఐలండ్) గుర్తింపును తెసికొని వచ్చింది.
రామకృష్ణ మనోహర ఆశ్రమం, సుల్తానాబాదు.
వైకుంఠ పురం (చిన్న తిరుపతి) - పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. దశాబ్దాలుగా తెనాలివారి తమదైన తిరుపతి.
ఎ.వి.రామారావు, శాస్త్రవేత్త.
నన్నపనేని నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత్త
దాలిపర్తి శేషయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, బీసీ నాయకుడు.