ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

బద్వేలు నియోజకవర్గం

బద్వేలు, కడప జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. పిన్ కోడ్ నం. 516227. బద్వెల్ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గం. ప్రస్తుతానికి ఎస్సీకి రిజర్వ్ చేయబడింది.

చరిత్ర

మాట్ల కుమార అనంత కాలములో ఆముదాలయేరు, తిక్కలేరు, గుండ్లవాగు అను మూడు వాగుల సంగమములో భద్రపల్లె అనే గ్రామము ఉంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు కూడా నిర్మించబడింది. భద్రపల్లె కాలక్రమములో బద్దవోలు, బద్దెవోలు అయినది. ఇదియే నేటి బద్వేలు పట్టణము. మరొక కథనము ప్రకారము 'సుమతి' శతక కారుడైన "బద్దెన" పేరు మీదుగా మొదట 'బద్దెనవోలు' అనియు, పిమ్మట అదియే 'బద్దెవోలు' గను, కాలక్రమమున నేటి 'బద్వేలు' గను రూపాంతరము చెందడమయినది. నేడు బద్వేలు వైఎస్ఆర్ జిల్లాలో ఒక ముఖ్యమయిన నియోజకవర్గముగా విరాజిల్లుచున్నది.

జనాభా

బాద్వేల్ (SC) అసెంబ్లీ నియోజకవర్గం - బాద్వేల్  విధానసభ (124) కడప జిల్లా లో ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మరియు కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 274179 జనాభాలో 74.24% గ్రామీణ మరియు 25.76% పట్టణ జనాభా. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల నిష్పత్తి మొత్తం జనాభాలో వరుసగా 21.73 మరియు 1.8. 2018 నాటి ఓటర్ల జాబితాలో 170664 ఓటర్లు, 261 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

సమస్యలు 

  • బద్వేలు నియోజకవర్గంలో రోడ్లు పరిస్థితి దారుణం
  •  సోమశిల ఎత్తిపోతల పథకం చేపట్టాలి
  • పరిశ్రమలు లేవు
  • బద్వేల్ పట్నంలో 29 వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ అందులో 1 లేదా రెండింటికి మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉన్నది. మిగతా అక్రమ వాటర్ ప్లాంట్స్ ను ఆఫ్ చేయాలి
Top