కడప ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రాయలసీమ ప్రాంతములోని నగరము. వైఎస్ఆర్ జిల్లాకు ముఖ్యపట్టణము. 1955 లో కడప నియోజకవర్గం ఏర్పడినది.
నగరానికి రెండు వైపులా నల్లమల అడవులు ఉండగా, ఒక వైపు పాలకొండలు గలవు. తిరుమల వెంకటేశ్వర స్వామికి గడప కావటంతో దీనికి ఆ పేరు సిద్ధించింది.
కడపలో ముంబై చెన్నై రైల్వే లైన్ ఇది చాల పురాతనమైనది అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కడప బెంగళూర్ రైల్వే లైన్ ఉన్నాయ్ ఇది పెళ్ళిమర్రి వరకు పూర్తి అయింది . కడపలో కర్నూలు రాణిపేట లను కలిపే 40 వ జాతీయ రహదారి మరియు చెన్నై ముంబై లను 716 వ జాతీయ రహదారి వయా పుత్తూరు, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, ముంబై ల రహదారి మరియు కడప బెంగళూర్ 340 వ జాతీయ రహదారి వయా రాయచోటిి, మదనపల్లె, బెంగళూరు రహదారి మరియు కడప విజయవాడ హైవే వయా మైదుకూరు, పొరుమామిళ్ళ, కంభం, మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే మరియు కడప పులివెందుల హైవే, కడప బద్వేల్ నెల్లూరు హైవేలు కడప లో ఉన్నాయి.
కడప నగరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సెన్సస్ ఇండియా యొక్క తాత్కాలిక నివేదికల ప్రకారం, 2011 లో కడప జనాభా 343,054; ఇందులో పురుష మరియు స్త్రీలు వరుసగా 172,357 మరియు 170,697 ఉన్నాయి.