మైదుకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కడప జిల్లా, మైదుకూరు పట్టణం.ఈ పట్టణము రాయలసీమ కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.తిరుపతి, కడప, నెల్లూరు తదితర నగరములను కలుపుతూ ఈ పట్టణము ప్రధాన రవాణా కూడలిగా ప్రసిద్ధి కెక్కినది.
ఈ పట్టణము లోని ప్రసిద్ధ మాధవరాయ స్వామి పేరు మీదుగా ఈ పట్టణానికి మాధవకూరు, క్రమేణా మైదుకూరు అనే పేరు స్ఠిరపడినది అని చెబుతారు.
ఈ ప్రాంతంలో ఎక్కువగా వరి, కృష్ణాపురం ఉల్లి, పసుపు, ప్రొద్దు తిరుగుడు, మిరప, టమేటా పంటలు సాగు చేస్తారు. ఇక్కడ పండంచే కృష్ణాపురం ఉల్లికి సింగపూర్, శ్రీలంక తదితర దేశాలలో మంచి గిరాకీ ఉంది. ఈ ప్ర్రాంతంలో పాడి పరిశ్రమ కూడా బాగా వృద్ది చెందింది. ప్రతి శనివారం జరిగే 'సంత' లో పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు జరుగుతుంటాయి.
మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం - మైదుకూరు విధాన సభ (133) కడప లో ఉంది. - ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మరియు కడప లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, 261868 జనాభాలో 100% గ్రామీణ మరియు 0% పట్టణ జనాభా.