'గడప’ అంటే ప్రవేశ ద్వారము. హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల కొండలకు పశ్చిమ దిశలో ప్రవేశ మార్గంగా ఉన్న ఈ ప్రాంతాన్ని 'దేవుని గడప’ పేరుతొ అనాదిగా పిలిచేవారు. అది కాలక్రమేణా ' కడప’ గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం కడప ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దిక్షిణ భాగంలో, నల్లమల్ల కొండలు, పాలకొండల మధ్య, తురుపు, పశ్చిమ కనుమలు కలిసే కూడలిలో ఉంది. క్రీస్తు పూర్వం 2 వ శతాబ్దం నుండే ప్రాచీన చరిత్ర గల ఈ జిల్లా మౌర్యులు, శాతవాహహానుల పాలనలో ఉంది. తరువాతి కాలంలో ఈ ప్రాంతాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు పాలించారు. మధ్య యుగంలో ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూటులు, కాకతీయులు, గోల్కొండ నవాబులు పాలించారు , ఆ తరువాతికాలంలో మరాఠాలు, పిమ్మట హైదరాలి, టిప్పు సుల్తాన్ వంటి మైసూర్ రాజుల ఆధ్వర్యంలో ఉండేది కడప . ప్రాచీన శిలాశాసనాలలో కడపను 'హిరణ్య నగరంగా పిలిచేవారు.
ఆది మానవుడు కడప జిల్లాలో సంచరించాడనేదుకు వీలుగా అనేక చారిత్రిక ఆనవాళ్లు ఉన్నాయి. కడప జిల్లా ముద్దనూర్లో చింతకుంట రాతి గుహల్లో బయల్పడిన రాతి చిత్రాలు దేశంలోనే రెండవ అతి పేద్ద ప్రాచీన యుగపు పెయింటింగ్స్ గా, యునెస్కో హెరిటేజ్ గుర్తింపును పొందింది. ఈ జిల్లాలోని జమ్మలమడుగు,మైలవరం డాం, మరియు గండికోట ప్రాంతాలలో కూడా ఆదిమానవుని అవశేషాలు అనేకం లభ్యమయ్యాయి. ఈ జిల్లాలోని రాయచోటిలో మధ్య రాతి యుగం నాటి అనేక స్థలాలు బయటపడితే, సుండుపల్లె తాలూకా, దేవాండ్లపల్లి గ్రామంలో అతిపెద్ద మధ్యరాతియుగం కాలపు ఆనవాళ్లు బయటపడ్డాయి.
మౌర్యులు, శాతవాహనులు పాలించిన ప్రాంతంలో బౌద్ధం ఆనవాళ్లు తప్పకుండా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా బౌద్ధం విస్తరించిందనేదుకు సాక్ష్యం చెయ్యేరు, పెన్నానది పరివాక ప్రదేశాలలో బయటపడ్డాయి. ఈ జిల్లాలో నందలూరు, తాళ్ళపాక, రాజంపేట, కొండూరు, ఖాజీపేటలలో అనేక బౌద్ధమత విహారాలు,స్తూపాలు బయటపడ్డాయి. బౌద్ధంతో బాటు జైన మతం కూడా ఇక్కడ విస్తరించిందనేదుకు వీలుగా పెన్నానది వొడ్డున దానవులపాడు గ్రామంలో బయటపడ్డ జైనమందిరమే సాక్షిగా పేర్కొనవచ్చు.
రాయలసీమలోని నాలుగు జిల్లాలలో, దక్షిణమధ్య భాగంలో ఉన్న కడప జిల్లాలో 2011 వ జనాభా లెక్కల ప్రకారం 344,078. మంది నివసిస్తున్నారు. పెన్నా నదికి దక్షిణంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప పట్టణం ఈ జిల్లా ప్రధాన కేంద్రం. కడప జిల్లా ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయం, గనుల తవ్వకం మీద ఆధారపడివుంది. అపారమైన ఖ. నిజ నిక్షేపాలున్నా కడప జిల్లా రాష్ట్ర స్థూల ఆర్థికాభివృద్ధికి 26,342 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నది . ఇది రాష్ట్ర స్థూల ఉత్త్పత్తిలో 5%. 2013-14 ఆర్ధిక సంవత్స్రంలో ఈ జిల్లా సగటు తలసరి ఆదాయం 70,821 రూపాయలు. జిల్లాలో 24% నల్లరేగడి భూములు, 25% ఎర్రరేగడి భూములు, 19% ఇసుకనేలలలు , 4% యెర్ర ఇసుకతో నిండిన నెలలున్నాయి. ఈ భూముల్లో ఎక్కువగా కొర్రలు, నిమ్మ, ఆరెంజ్ , తమలపాకు పంటలు పండుతున్నాయి. ఇవి అధికభాగం సుంకేశుల జలాశయాన్ని అనుకుని తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో కేంద్రీకరింపబడి ఉన్నాయి. కే. సి. కెనాల్ ద్వారా కడప, కర్నూల్ జిల్లాలో 49 కిలోమీటర్ల మేర సాగునీరందుతుండగా, గాలేరు-నగరి సుజల స్రవంతి నుండి తాగునీటి సరఫరా జరుగుతున్నది.
1983వె సంవత్సరపు సర్వే అఫ్ జియోలాజికల్ ఇండియా నివేదిక ప్రకారం ఈ జిల్లాలో 3 మిలియ న్ టన్నల సీసం , 74,000,000 టన్నుల బైరైటీస్, 27000 టన్నుల ఆస్బెస్టాస్, నిల్వలున్నాయి. ఇందులో t 70 మిలియన్ బైరైటీస్ నిల్వలు మంగంపేటలో ఉన్నట్లు అంచనా. ఇంతేకాకుండా రాజంపేటలోమట్టిదిబ్బలు, ఎర్రగుంట్లలో సున్ననపురాతి గనులున్నాయి. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఆస్బెస్టాస్ తవ్వకాలు బ్రహ్మణపల్లెలో జరుగుతున్నది. వీటన్నిటితోబాటు కడపజిల్లాలో ప్రత్యేకంగా లభ్యమయ్యే 'కడప రాళ్లు' నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
పాలనా సౌలభ్యం కోసం జిల్లాను 3 రెవెనూ డివిజన్లుగా, 50 మండలాలుగా విభజించారు . 67.88% అక్షరాస్యత ఉన్న ఈ జిల్లా భారతదేశంలో 250 వెనుకబడిన జిల్లాలో ఒకటిగా 2006లో గుర్తించారు. జిల్లాలో 4,488 పాఠశాలలున్నాయి. అందులో 22 రాష్ట్ర ప్రభుత్వాధీనంలో ఉండగా, , 3,094 మండల మరియు జిల్లా పరిషత్ స్కూళ్లున్నాయి. జిల్లాలో ఒక రెసిడేన్షియల్ పాఠశాల, 1,181 ప్రేవేట్స్కూళ్లు, , 10 మోడల్ l, 29 కస్తూర్భాగాంధీ విద్యాలయాలు, 8 మునిసిపల్ మరియు 63 ఇతరుల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లున్నాయి.
జిల్లాలో ఉన్నత విద్య కూడా గణనీయంగా పెరిగినదనడానికి వీలుగా 5 ప్రభుత్వ, 13 సాంఘీఖ సంక్షేమ, , 26 ప్రవేట్ ఎయిడెడ్, 83 ప్రవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలున్నాయి.ఇవికాకుండా కోన్ సహకార పద్దతిలో లేదా ఇతరుల ఆర్ధిక సాయంతో నడిచే జూనియర్ కళాశాలున్నాయి. ,కడప, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి, రాజంపేటలలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నతాభిద్యకు పటిష్టమైన పునాదులు వేయడానికి 1960 లలోనే స్థాపించారు. ఇవి కాకుండా జిల్లాలో పలు నర్సింగ్, పాలిటెక్నీక్, ఉఫాధ్యాయ శిక్షణ, ఫార్మసీ, ఇంజనీరింగ్, వైద్య, న్యాయ కళాశాలలు విశ్వవిద్యాలయ స్థాయి విద్యను బోధిస్తున్నాయి.
జిల్లాలో కరువు, నీటి సమస్య ప్రధానమైనది. సంవత్సరంలో ఒక్క పంట మాత్రమే పండిస్తున్న రైతులు, వ్యవసాయం లేనప్పుడు జీవనోఫాదిలేక ఇతర పట్టణాలకు వలసపోతున్నారు. వర్షంపై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థలో రుతుపవనాలు సక్రమంగా వచ్చినప్పుడే ఆదాయం దొరుకుతుంది. ఆర్ధికంగా, పారిశ్రామికంగా వెనుకబడిఉన్న ఈ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై, జీవనాధారం లేక, పేదరికం అనుభావిస్తున్నాయి. జిల్లా అభివృద్ధికి కేంద్రనిధులు, రాష్ట్ర సంకల్పం అవసరం.