ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

గుడివాడ నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో గుడివాడ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 197388 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 96466 కాగా ఆడవారి సంఖ్య 100907.

గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు. అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి.

గుడివాడ పట్టణ చరిత్ర

ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ధి చెందింది. రాజ్య విస్తరణలో భాగంగా అశోకుడు, కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు, యుద్ధంలో గెలిచిన అశోక చక్రవర్తిని రాజుగా అంగీకరించారు. క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో కృష్ణా నదికి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.

అమరావతి, భట్టిప్రోలు, నాగార్జునకొండ, జగ్గయ్య పేట, బోడపాడు, చందోలుతో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి,మహా చైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని,ఆ నివేదికను పుణీలో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.

రవాణా సౌకర్యాలు

గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.

గుడివాడ ప్రాంతము నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి, బెంగులురు, హైదరాబాదు మరియు మచిలీపట్నం రైల్వే మరియు బస్ వసతులు ఉన్నాయి.

ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో గన్నవరం విమానాశ్రయము ఉంది.

ఈ నియోజకవర్గంలోని మండలాలు:

  • నందివాడ
  • గుడ్లవల్లేరు
  • గుడివాడ

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • ఈ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో త్రాగు నీటి సమ్యస్యతో  పాటు రహదారుల          సమస్యలు ఉన్నాయి. 
  • గుడివాడ పట్టణంలో రైల్వే గేట్ల వల్ల ట్రాఫిక్ సమస్యలను నిర్మిలించడానికి రైల్వే బ్రిడ్జిలు  నిర్మించాలని ఇక్కడి  ప్రజలు కోరుకుంటున్నారు.
  • డ్రైనేజి వ్యవస్థ బాగులేక, ప్రాంతమంతా మురుగు కంపుతో నిండిపోయింది
  • నందివాడ  మండలంలోని డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు అనారోగ్యాలపాలవుతున్నారు.
Top