ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

జగ్గయ్యపేట నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 184960 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 90202 కాగా ఆడవారి సంఖ్య 94742.

జగ్గయ్యపేటకు తూర్పున ఉన్న శిథిలాలు, ఇక్కడ బౌద్ధ నివాసాలు ఉన్నట్టు తెలుపుతున్నాయి. ఇవి దాదాపు 2000 సంవత్సరాల పురాతనమయినవని నమ్ముతున్నారు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

జగ్గయ్యపేటలోని ముక్త్యాల గ్రామంలో కోటిలింగాల హర హర మహాక్షేత్రం, మరియు జగ్గయ్యపేటలోని శ్రీ చంద్రమౌలీశ్వర స్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు.

నియోజకవర్గంలోని మండలాలు

  • వత్సవాయి
  • జగయ్యపేట
  • పెనుగంచిప్రోలు
  • నందిగామ (పాక్షికం)

జగ్గయ్యపేట పట్టణ చరిత్ర

దీని పూర్వనామము బేతవోలు. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. అతడి తండ్రి పేరు జగ్గయ్య మీద జగ్గయ్యపేటనూ, తల్లి అచ్చమ్మ పేరు మీద అచ్చంపేటనూ స్థాపించాడని ప్రతీతి.

ఈయన గొప్ప శివ భక్తుడు.  ఆ భక్తితోనే ఎన్నో శివాలయాలు, విష్ణ్వాలయాలు కట్టించాడు.

బేతవోలు అనే పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని వాసిరెడ్డి అభివృద్ధి పరచి జగ్గయ్యపేట అనే పట్టణంగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. రాజుకి ముందు ఈ గ్రామములో దొంగలుండేవారనీ, అందువలన ఈ ఊరి పేరు దొంగల బేతవోలుగా పరిగణించబడేదనీ తెలుస్తూంది. కొంత కాలం పాటూ ప్రభుత్వ రికార్డుల్లోనూ కొందరి దస్తావేజుల్లోనూ బేతవోలనే పేరుతోనే వ్యవహరించబడింది.

ఈ నియోజవర్గపు సమస్యలు:

జగ్గయ్యపేటలోని ప్రజలు  నీటి సమస్యతో బాధ పడుతున్నారు,  కృష్ణ నది నుంచి నీటి సరఫరాకి ప్రోజెక్టు నిర్మించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

నియోజకవర్గంలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. 

Top