కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో కైకలూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 189343 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 94512 కాగా ఆడవారి సంఖ్య 94821.
జిల్లా పరిధిలోని కొల్లేరు ప్రాంతం మొత్తం ఈ నియోజకవర్గం క్రింద వస్తుంది.
ఈ నియోజకవర్గంలోని కొల్లేటి సరస్సు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం.
శ్రీ శ్యామలాదేవి ఆలయం:- ఊరి ముఖ్యదేవత అయిన శ్రీశ్యామలాంబ పేరుమీదుగా ఇక్కడ సింహభాగం అంగళ్ళు, మనుషులు ప్రతివాటికీ శ్యామల పేరే అధికంగా కనిపిస్తుంది. శ్రీ శ్యామలాంబ అమ్మవారి శ్రీ చండీ మహాయాగ సహిత శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఘనంగా జరుగును.
శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయము:- మీసాల వెంకన్నగా భక్తులు ఆరాధించే ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖ మాసంలో నిర్వహించెదరు.
అట్లూరి పుండరీకాక్షయ్య :- తెలుగు సినిమా నిర్మాత మరియు నటుడు. ఎన్.టి.ఆర్ తో కలిసి "నేషనల్ ఆర్ట్ థియేటర్" స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనకుంది.
బలే వెంకటరావు అఖిల భారత మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ఆ సంఘానికి భారత దేశానికి చెందిన అధ్యక్షులు, మన రాష్ట్రానికి, 11 మందితోకూడిన ఒక కమిటీని ప్రకటించగా, ఆ కమిటీలో శ్రీ వెంకటరావుని, కార్యదర్శిగా నియమించారు. [6]
పరిమి రామకృష్ణశాస్త్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేకప్రాంతాలలో రామాయణం, సుందరకాండలను ప్రచారంచేసి, రామాయణ వాచస్పతి గా బిరుదు పొందిన శ్రీ పరిమి రామకృష్ణశాస్త్రి, కైకలూరు గ్రామానికి చెందినవారే.
జన్యావుల ధనార్జునరావు (జె.డి.రావు) భారత అంతరిక్ష పరిశోధన సంస్థ "I.S.R.O"లో అత్యంత కీలకమైన విభాగంలో పనిచేయుచూ, ఇటీవల ప్రారంభించిన అంగారక గ్రహ యాత్ర "మాం" విజయవంతంలో ముఖ్య పాత్ర వహించిన శ్రీ జన్యావుల ధనార్జునరావు (జె.డి.రావు), కైకలూరుకు చెందినవారే.
ఈ నియోజవర్గపు సమస్యలు: