కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో మైలవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 234025 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 116819 కాగా ఆడవారి సంఖ్య 117198.
శ్రీ కోట మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం:- స్థానిక కోట వెనుకన ఉన్న ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-17, ఆదివారం నాడు శ్రావణమాసం సందర్భంగా, జలాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం ద్వారకా తిరుమల దత్తత దేవాలయం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిరవ్హించెదరు.
శ్రీ కంచి కామాక్షి సమేత శ్రీ ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయం.
శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక నూజివీడు రహదారిపై ఉన్న ఈ ఆలయం, ద్వారకాతిరుమల దేవాలయానికి దత్తత దేవాలయం. ప్రతి సంవతరం ఈ ఆలయంలో హనుమజ్జయంతి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఆలయంలో గత 23 సంవత్సరాలుగా హనుమద్దీక్షాధారణ పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించుచున్నారు.