కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో నందిగామ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 184092 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 90755 కాగా ఆడవారి సంఖ్య 93317.
వీరు రాష్ట్ర శాసనసభకు ప్రథమ స్పీకరు. అయ్యదేవర కాళేశ్వరరావు (1882 జనవరి 22 - 1962 ఫిబ్రవరి 26) స్వాతంత్ర్య సమర యోధుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు. వీరు కృష్ణా జిల్లా నందిగామలో లక్ష్మయ్య, వరలక్ష్మమ్మ దంపతులకు 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు. జమిందారీల చట్టం విషయంలోగల విశేష పరిజ్ఞానం మూలంగా పలువురు జమిందారులకు లాయరుగా పనిచేశారు.స్వాతంత్ర్యానంతరం1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయవాడ నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి శాసనసభకు అయ్యదేవర కాళేశ్వరరావును తొలి స్పీకర్‌గా ఎన్నికయ్యాడు. 1956 నుండి 1962 వరకు రాష్ట్ర శాసనసభ స్పీకరుగా బాధ్యతలు నిర్వర్తించాడు. 1962లో శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు, కానీ ఫలితాలు వెలువడడానికి ముందురోజే తుదిశ్వాస వదిలాడు.విజయవాడలో పేరొందిన మునిసిపల్ మార్కెట్ ఈయన పేరు మీదుగా నిర్మించారు అదే కాళేశ్వరరావు మార్కెట్.
శ్రీ శుక శ్యామలాంబా సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం(శివాలయం)
వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, సుమారుగా 400 సంవత్సరాల క్రితం కట్టించారు. ఈ దేవాలయంలో నాలుగు దిక్కులా రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర, చంద్రమౌళీశ్వర స్వామివారల ఉపాలయాలున్నవి. మధ్యలోని ప్రధానాలయంలో శ్రీ రామలింగేశ్వరస్వామివారు కొలువుదీరి ఉండటంతో, ఈ దేవాలయము పంచలింగక్షేత్రము గా ప్రసిద్ధిచెందినది. అందువలన నందిగామ అను పేరువచ్చినది. ఈ ఆలయానికి 275 ఎకరాల మాన్యం భూములున్నవి. ఆ భూముల వలన ప్రతి సంవత్సరం ఆలయానికి లక్షల రూపాల ఆదాయం వచ్చుచున్నది. ఈ ఆలయము ఇప్పుడు దేవాదాయధర్మాదాయ శాఖవారి ఆధీనములోఉండి వాసిరెడ్డి రామనాథబాబు ధర్మకర్తగా ఉన్నారు. ఈ దేవాలయములో ప్రతిపూర్ణిమకు మరియు మాసశివరాత్రికి ప్రత్యేకపూజలు జరుగుతాయి.
ఈ ఆలయంలో శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవముగా జరుగును.
నందిగామలోని 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని, పుష్కర నిధులు విరాళాలు, 26 లక్షలతో నూతనంగా పునర్నిర్మించారు.
ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్రుల మూల విరాట్టును, యంత్రాన్నీ ప్రతిష్ఠించారు. జీవధ్వజస్తంభం, ఆంజనేయస్వామి, విఖనస మహర్షి, రామానుజస్వామి, రాధాకృష్ణులు, విమాన శిఖరాలను ప్రతిష్ఠ చేసారు.
ఈ దేవాలయమును రాష్ట్ర ప్రథమ స్పీకరు అయిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారు నిర్మించారు. ఈ దేవాలయము శిథిలము చెందగా, మరల వారి కుమారులు కృష్ణమోహనరావుగారు శ్రీ దుర్భాకుల సుబ్రహ్మణ్యకామేశ్వర ఘనపాఠిగారి పర్యవేక్షణలో పునర్నిర్మాణముకావించీ మరియు అమ్మవారి మూల విరాట్టుతో సహా ప్రతిష్ఠలు చేయించి అత్యంత సుందరముగా తీర్చిదిద్దినారు.
గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.