ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పామర్రు నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో పామర్రు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 172005 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 84951 కాగా ఆడవారి సంఖ్య 87042.

నియోజక వర్గాల పునర్విభనలో ఉయ్యూరు ప్రస్తుతము పెనమలూరుశాసనసభ నియోజకవర్గం పరిధి లోనికి చేరినది.

స్వర్గియ  ఎన్.టి రామారావు  ఈ నియోజకవర్గంలోని నిమ్మకూరు జన్మించారు. తెలుగు కల వైభవాన్ని ప్రమంచానికి చాటిచెప్పిన కూచిపూడి నృత్యం పుట్టింది ఇక్కడే.

దర్శనీయ ప్రదేశములు

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం

శ్రీ వల్మీకేశ్వరీ అమ్మవారి (పుట్లమ్మ తల్లి) ఆలయం

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం

ఈ ఆలయం స్థానిక వెలమపేటలో, శివాలయం రహదారిపై ఉంది. అమ్మవారికి 108 బిందెల నీళ్ళతో అభిషేకం చేసి, అనంతరం, పట్టు వస్త్రాలు ధరింపజేసి, పంబలవారు అమ్మవారి చరిత్రను పారాయణ చేసెదరు. పోతురాజు గడను అలంకరించి, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో అమ్మవారు, పోతురాజు, ఘటం కుండలతో గ్రామోత్సవం నిర్వహించెదరు. గ్రామ మునసబు వారసుడు శ్రీ బొమ్మారెడ్డి మధుసూదనరెడ్డి ఇంటి నుండి తొలి నైవేద్యాన్ని స్వీకరించెదరు.

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం

స్థానిక గుడివాడ రహదారిలోని సాయినగరులోని ఈ ఆలయ 21వ ప్రతిష్ఠా మహోత్సవాన్ని జరిపారు.

అనంతరం పంచామృతసహిత రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులచే సామూహికంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు.

నియోజకవర్గంలోని మండలాలు

  • తోట్లవల్లూరు
  • పమిడిముక్కల
  • పామర్రు
  • మొవ్వ
  • పెదపారుపూడి

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • కృష్ణ నది పక్కనే పారుతున్న నియోజక వర్గంలో త్రాగు మరియు సాగునీటి సమస్యలు ఉన్నాయి.
  • స్వర్గిన ఎన్.టి రామారావు  ఈ నియోజకవర్గంలోని నిమ్మకూరు జన్మించారు.
  • ప్రధాన రోడ్లు పర్వాలేదు అనిపిస్తున్న పామర్రులో అంతర్గత రోడ్లు అంతంత మాత్రమే.
  • పాములలంక బ్రిడ్జి నిర్మించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
  • డ్రైనేజి వ్యవస్థ బాగులేక, మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు.
Top