ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పెడన నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో పెడన శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 156843 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 78151 కాగా ఆడవారి సంఖ్య 78692.

నియోజకవర్గ చరిత్ర

చేనేత ఇక్కడ ప్రముఖ పారిశ్రామిక రంగము. పెడన అనగానే గుర్తు వచ్చేది కలంకారీ కళ. ఇది వస్త్రాల పై అద్దకానికి సంబంధించిన కళ. ఈ కళను ఉపయోగించి ప్రస్తుతం లుంగీలు,చీరలు,టెబుల్ క్లాత్ లు,డోరు కర్టెన్లు, దుప్పట్లు, కర్చీఫులు వంటివి తయారు చేస్తున్నారు. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. ఈ కళకు చాలా ఘనమైన చరిత్ర ఉంది. ప్రస్తుతం ఈ కళ పెడన, శ్రీకాళహస్తి వంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే సజీవంగా ఉంది. పెడన నేత వస్త్రాలకు కూడా పేరేన్నిక గన్నది. ఇక్కడ నూలుతో మెత్తటి బట్టలు తయ్యారు చేయుదురు.

ప్రముఖులు

ఈ ఈ నియోజకవర్గానికి చెందిన కలంకారీ ఎగుమతుదారులైన శ్రీ పిచ్చుక శ్రీనివాస్, భారత ప్రభుత్వ హస్తకళల అభివృద్ధిబోర్డు సభ్యులుగా నియమితులైనారు.

ఈ నియోజకవర్గానికి చెందిన శ్రీ భట్టా ఙాన కుమారస్వామి, ఆంధ్రా విశ్వవిద్యాలయంనుండి ఎం.ఎస్.సి. జియోఫిజిక్సులో పట్టా పొందినారు. అనంతరం వీరు అయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో ప్రవేశించారు. వీరిని ఇటీవల పెట్రోలియం మంత్రిత్వశాఖ వారు, 2014 సంవత్సరానికిగాను, "పెట్రోఫెడ్ ఇన్నొవేటర్" పురస్కారానికి ఎంపిక చేసారు. ఈయనకు ఈ పురస్కారాన్ని, ఇటీవల కొత్తఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, పెట్రోలియం మంత్రిత్వశాఖ సహాయమంత్రి శ్రీ ధర్మేంద్రప్రధాన్ చేతులమీదుగా అందజేసినారు. భూమి లోపల ఏర్పడే తరంగాల ఫలితంగా పెట్రో ఉత్పత్తుల అన్వేషణలో ఏర్పడే అవరోధాలను ఏ విధంగా అధిగమించాలనే అంశంపై వీరు చేసిన ప్రయోగాలకుగాను, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. వీరి ఈ ప్రయోగం, వాణిజ్యపరంగా గూడా విజయవంతమైనట్లు అయిల్ ఇండియ లిమిటెడ్ సంస్థవారు పేర్కొన్నారు.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ పైడమ్మతల్లి ఆలయం

ఇక్కడ ప్రతి సంవత్సరం పైడమ్మ సంబరాలు మార్గశిర పౌర్ణమి నాటి నుంచి పదకొండు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి.

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం

ఇది ఈ నియోజకవర్గానికి చెందిన ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం.

శ్రీ శ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం

ఇక్కడ దసరా నవ రాత్రులలో వివిధ వంశాలకు చెందిన దంపతులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, వైశాఖపౌర్ణమికి, అమ్మవారి శాంతికళ్యాణాన్ని వైభవంగా నిర్వహించెదరు.

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • అభివృద్ధికి ఆమడ దూరం లో ఉన్న పెడన నియోజకవర్గంలో  నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది, ముక్యంగా బంటుమిల్లి
  • కృతివెన్నుమండలాలలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కృష్ణ డెల్టా చివరి ప్రాంతం కావడంతో చుక్క నీరు రావడం లేదు.
  • వారానికి వచ్చే ట్యాంకర్ల మీదే అదరపడవలసివస్తుంది.
  • నిర్వహన  సరిగా లేక కృతివెన్ను చెరువు కలుషితమైంది. 
  • నియోజకవర్గంలో సాగు నీటి సమస్యలతో రైతులు కష్టాలు పడుతున్నారు.
  • పెడన మునిసిపాలిటీలో తప్ప మిగతా చోట్ల ఎక్కడ సరైన రోడ్లు లేవు.  గ్రామాల మధ్య రోడ్లు దారుణంగా ఉన్నాయి.
  • వైదుల కొరతతో పెడన నియోజకవర్గ కేంద్ర ఆసుపత్రి సతమతమవుతోంది. రోగులకు సరైన వైద్య అందాకా ఇబ్బందులు పడుతున్నారు.
Top