ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

తిరువూరు నియోజకవర్గం

కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో తిరుపూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 187072 గా నమోదయింది. అందులో మగవారి సంఖ్య 93863 కాగా ఆడవారి సంఖ్య 93196.

చరిత్ర

నాలుగు శతాబ్దాలకు పూర్వం, ప్రస్తుత తిరువూరు, "లక్ష్మీపురం" అనే వ్యవహారనామంతో కొనసాగేది. రావు బహద్దూరు జమీందారుల పాలనలో ఉండేది. అప్పట్లో, అన్నాజీరావు దంపతులు, తిరుపతి పుణ్యక్షేత్రానికి ఎడ్లబండిపై ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ అర్చకుడు, 16 కళలలో ప్రాణప్రతిష్ఠ చేసిన శఠగోపాన్ని వీరికి అందించారు. శఠగోపంతో తిరిగి వచ్చిన దంపతులు, తమ ఇంటిప్రక్క స్థలంలో, ఆలయాన్ని నిర్మించారు. శ్రీపతి, తిరుపతి నుండి రావటం వలన, "తిరు" అనీ, ఊరూరా శఠగోపం పూజలందుకోవడం వలన "వూరు" అనీ, వెరసి, "తిరువూరు"గా నామకరణం చేశారు. దీనితో, నాటి లక్ష్మీపురం, నేడు, "తిరువూరు" పేర కొనసాగుచున్నది.

దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

  • శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, శాంతి నగర్
  • శ్రీ రామాలయం, నడిమ తిరువూరు
  • శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, పాతూరు.
  • శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, నడిమ తిరువూరు
  • శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, బస్సు స్టాండ్ సెంటర్ (ప్రధాన అర్చకులు : భవాని రాధాకృష్ణ)
  • పాత శివాలయం, నడిమ తిరువూరు
  • శ్రీ వినాయకస్వామివారి ఆలయం, బైపాస్ రోడ్
  • శ్రీ అష్టలక్ష్మి ఆలయం, రాజుపేట
  • శ్రీ రంగానాయక స్వామి వారి ఆలయం, పాతూరు
  • శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, బస్సు స్టాండ్ సెంటర్
  • శ్రీ శ్యామవేది మందిరం, చీరాల సెంటర్ దగ్గర.
  • శ్రీ సీతారామస్వామివారి ఆలయం, పాతూరు.

ఈ నియోజకవర్గంలోని ప్రముఖ దేవాలయాలు.

తిరువూరు పట్టణ ప్రముఖులు

  • షేక్ హుసేన్
  • కె.రామారావు (డి.సి.యం.యస్. చైర్మెన్)
  • రామిశెట్టి విజయకృష్ణ ఐ.పి.ఎస్. అధికారి.
  • యర్రమిల్లి సూర్యనారాయణమూర్తి: ఇతను ఈ గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్.ఇతను దర్శకత్వం చేసి, తొలిగా నిర్మించిన "శ్వాస" అను లఘుచిత్రం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైంది. 2016  లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ఈ పురస్కార జ్యూరీ కమిటీ సభ్యులనుండి ఇతను ఈ పురస్కారాన్ని అందుకున్నాడు.

నియోజకవర్గంలోని మండలాలు

  • విస్సన్నపేట
  • గంపలగూడెం
  • తిరువూరు
  • ఏ.కొండూరు

ఈ నియోజవర్గపు సమస్యలు:

  • తిరువూరు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. వీరికి అవసరమైన వైద్య సేవలు అందించే స్థాయిలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లేదు.
  • గడిచిన మూడేళ్ళలో ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదని, ప్రజలు వాపోతున్నారు. మరియు డ్రైనేజీ పారిశుద్యం దారుణమైన స్థితిలో  ఉన్నాయి.
  • తిరువూరు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం అని తెలిసిన కూడా పూర్తి స్థాయి రక్షిత మంచినీటి సరఫరా చేసి ప్రయత్నాలు జరగడం లేదని ప్రజలు బాధపడుతున్నారు.
  • చెక్ డ్యామ్ల పనులు నత్త నడకన జరుగుతున్నాయి.
Top