కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో విజయవాడ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 2,59,001 గా నమోదయింది.
విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్దనగరం. కృష్ణా జిల్లా లో, కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఈ నగరం ఆంధ్ర కోస్తా ప్రాంతంలో ప్రసిద్ధ వ్యాపారకేంద్రం. మద్రాసు-హౌరా మరియు మద్రాసు-ఢిల్లీ రైలు మార్గములలో విజయవాడ వస్తుంది. దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ అతి పెద్ద కూడలి. భారత దేశం లోని అతిపెద్ద రైల్వే జంక్షన్లలో ఇది ఒకటి. విజయవాడను బెజవాడ అని కూడా పిలుస్తారు.
విజయవాడకు ప్రస్తుత నామము, ఇక్కడి అధిష్టాన దేవత కనక దుర్గ ఆమ్మవారి మరో పేరు అయిన విజయ (విజయవాటిక) నుండి వచ్చింది. ఇక్కడ ఉన్న అనేక కార్పొరేటు విద్యాసంస్థల వలన దీనికి విద్యలవాడ అనే పేరు కూడా వచ్చింది. ఎండాకాలములో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడ అన్నాడట. విజయవాడ, పడమరన ఇంద్రకీలాద్రి పర్వతములతో, ఉత్తరాన బుడమేరు నదితో కృష్ణా నది ఒడ్డున ఉంది.
1509 వరకూ ఆంధ్ర క్షత్రియులులో వశిష్ట గోత్రానికి చెందిన పూసపాటి రాజ వంశస్తులు విజయవాడ (బెజవాడ) నగరాన్ని పాలించారు.
నాగార్జున సాగరు నుండి మచిలీపట్నము వరకు గల కృష్ణా పరీవాహక ప్రాంతములలో రాతి యుగపు మానవుల సంచారము యొక్క ఆనవాళ్ళు లభించడం వలన, ఇక్కడ ప్రాచీన మానవులు నివసించారని భావిస్తున్నారు.
అర్జునుడు వేటగాని రూపములో ఉన్న శివుడిపై సాధించిన విజయానికి చిహ్నముగా ఇక్కడ విజయేశ్వరుడి (మల్లేశ్వర స్వామి లేదా జయసేనుడు)ని ప్రతిష్ఠించాడని పురాణగాథ. పురాణాలలో విజయవాడను విజయవాత అని పెలిచేవారు. దీని గురించి రాజేంద్రచోళ పురాణములో కూడా పేర్కొన్నారు.
హిందువులకు మరియు బౌద్ధులకు విజయవాడ ఒక ముఖ్య ఆధ్యాత్మిక స్థలము. కళ్యాణి చాళుక్యులు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించారు.
బ్రిటీషువారు పరిపాలిస్తున్న రోజులలో ఈ ప్రాంతము చాలా అభివృద్ధిని చవిచూసింది. వారి కాలంలో కృష్ణానదిపై ఇక్కడ ఆనకట్టను నిర్మించారు. దానితో వ్యవసాయాభివృద్ధి జరిగి, తద్వారా విజయవాడ పట్టణం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. ఈ రోజులలో సినిమా వ్యాపారానికి కూడా విజయవాడ ఒక కూడలి అని చెప్పవచ్చు.
2018 లో విజయవాడకు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులలో జాతీయ స్థాయిలో నాల్గో స్థానం, దేశంలోనే అత్యంత శుభ్రతను పాటిస్తున్న పెద్ద నగరాల్లో మొదటి స్థానం దక్కింది.
దర్శనీయ ప్రదేశాలలు
కనక దుర్గ అమ్మ వారి దేవాలయం
అమ్మలగన్నయమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువున్న అలయము. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణావది ఒడ్డువే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమవి ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి.
ఆధునిక యుగంలో అపురూపమైన శిల్పకళతో తయారైన గొప్ప దేవస్ధానం. అమ్మవారి మూర్తి అపురూపమైన మరకత శిలతో (పచ్చ) చెక్కబడింది. అంతేకాక, ఆలయవు గోడలన్నీ రాతితో చెక్కబడి శ్రీచక్రం లోని వివిధ చక్రాలు, వాటిలోని దేవతలను అద్భుతంగా దర్శింపజేస్తూ ఉంటాయి. ఆలయ శిఖరం సుమేరు శ్రీచక్ర అకారంలో ఉంటుంది. అమ్మ వారి ముందు కూర్మం (తాబేలు) పై మాణిక్యం (కెంపు) తో చేసిన శ్రీచక్రం అలరారుతూ ఉంటుంది. 2002 లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చే ఈ గుడి కుంభాభిషేకం మరియు ప్రతిష్ఠ జరుపబడింది.
బస్తీలలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది, కాలువల పక్కనే చెత్త పేరుకుపోయి మురికి కూపంలా ఉంటుంది.
ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకున్నవారికీ పట్టాలు ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ నియోజకవర్గంలో అన్నింటికీ మించిన పెద్ద సమస్య సిన్నగర్ చెత్త ప్లాంట్, ఈ డంపింగ్ యార్డ్ని ఎక్కడి నుంచి తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ నియోజకవర్గంలో త్రాగు నీటి సమస్య కూడా ఎక్కువగానే ఉంది, ప్రజాప్రతినిధులే ట్యాంకర్ల ద్వారా త్రాగు నీటిని సరఫరా చేయించాలని ప్రజలు కోరుకుంటున్నారు.