కృష్ణా జిల్లాలోని 16 శాసనసభ నియోజకవర్గాలలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య 2,78,451 గా నమోదయింది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం అత్యంత కీలకమైనది. గతంలో ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పునర్విభజన తర్వాత కొత్తగా అదే పేరుతో ఏర్పాటైన కొత్త నియోజకవర్గానికి ఏ మాత్రం పొంతన లేదు. కొత్తగా ప్రస్తుత నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాలుగా ఉన్నవి గతంలో కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి. బందరురోడ్డు, ఆటోనగర్, జాతీయ రహదారులు, అత్యధికమైన కాలనీలు, హెల్త్ యూనివర్సిటీ, గుణదల లోని మేరిమాత పుణ్యక్షేత్రం తదితర కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం ఉన్నాయి.
తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్, పటమట, పటమటలంక, రామలింగేశ్వరగనర్, మొగల్రాజపురం, గుణదల, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి.
విజయవాడ పట్టణ మండలంలోని కొన్ని గ్రామాలు
విజయవాడ పట్టణ కార్పోరేషన్‌లోని కొన్ని వార్డులు
దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు రెండు ఉండగా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 200 వరకు ఉంటాయి. ఆసియాలో అతి పెద్ద ఆటోనగర్‌గా పేరుగాంచింది. 275 ఎకరాల్లో ఆటోనగర్ విస్తరించి ఉంది. 53 ఎకరాల్లో ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌ను ఏర్పాటు చేశారు. ఆటోమొబైల్‌కు సంబంధించి వివిధ వర్క్‌షాపులు, ఫౌండ్రీలు కూడా ఉన్నాయి. ఆటోనగర్‌లో సుమారు 80 వేల మంది ఉపాధి పొందుతున్నారు.
విజయవాడలోనే అత్యంత రద్దీ కూడలి ప్రదేశం. అటు చెన్నై, ఇటు కోలకత్తాను కలిపే జాతీయ రహదారి. గతంలో ఇక్కడ బెంజ్ వాహనాల కంపెనీ ఉండడంతో ఆ పేరుతోనే ఈ జంక్షన్‌కు పేరు వచ్చింది. నిజానికి బెంజ్‌సర్కిల్ కూడలిలో ఉంది కాకాని వెంకటరత్నం విగ్రహం ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు.
గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం: ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 నెలలో మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తారు. లూర్థు నగరంలో ఉన్న మేరీ మాత పుణ్యక్షేత్రం తరహాలోనే గుణదల కొండ పై మేరీ మాత పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా అనేకమంది భక్తులు హజరవుతుంటారు.
ఈ నియోజకవర్గంలో అంతర్గత రోడ్లు మరియు రవాణా వ్యవస్థ బాగాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నియోజకవర్గంలో మరొక [ప్రధాన సమస్య త్రాగు నీరు కృష్ణ నది పక్కనే ఉన్నా సమస్య తీవ్రంగా ఉంది.
కృష్ణలంక ముంపు ప్రధాన సమస్య అయ్యింది, కృష్ణాదికి వరద వచ్చినప్పుడు ఏళ్ళు మునగకుండా నిర్మిస్తున్న గోడ పనులను త్వరితగతంగా పూర్తి చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు మెరుగుపర్చాలని ఈ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.