ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఆదోని నియోజకవర్గం

ఆదోని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన నియోజకవర్గం. 2011 జనాభా లెక్కల ప్రకారం, మొత్తం 269286 జనాభాలో 31.44% మంది గ్రామీణ మరియు 68.56% పట్టణ జనాభా ఉన్నారు. ఒకప్పుడు ఆదోని నియోజకవర్గం వ్యాపారం బాగా జరిగిన ప్రాంతం. ముంబైకి నేరుగా రైలు మార్గం ఉండటంతో రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఆదోనిని వ్యాపారపరంగా రెండో ముంబై గా స్థానికులు పిలుచుకునేవారు. పత్తి వేరుశనగ ఎక్కువగా సాగు అవుతున్నందున నూలు, ఆయిల్ మిల్లులు ఏర్పాటయ్యాయి. కర్నూలు జిల్లాలోనే అతి పురాతనమైన మునిసిపాలిటీ కూడా ఉంది అయితే వైభవం అంతా గతం ఇప్పుడు వ్యాపారాలు లేవు మిల్లులు మూతపడ్డాయి. కర్నూలు జిల్లాలోనే అతి పురాతనమైన మునిసిపాలిటీ ఇప్పుడు అత్యంత వెనుకబడిన ప్రాంతంగా తయారయ్యింది. స్థానిక యువత ఉపాధి కోసం వలస వెళుతున్నారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమి ఇక్కడ అమలవడం లేదు.

ఆదోని నియోజకవర్గంలో అభివృద్ధి కనిపించడం లేదుకనీసం ఓల్టేజీ సమస్య కూడా తీర్చలేని స్థాయిలో నాయకులు ఉన్నారు. అయితే ఆదాయం వచ్చే వ్యవహారాల్లో మాత్రం నాయకులు పార్టీలకతీతంగా ఉంటారని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి ఐక్యత ప్రజా సమస్యల పరిష్కారంలో ఎందుకు ఉండటం లేదు అన్నది సాధారణ ప్రజానీకం యొక్క సందేహం.  నీటి సమస్య ఎక్కువగా ఉంది. రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది.

Top