ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఆలూరు నియోజకవర్గం

ఆలూరు - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 2,19,023 మంది ఉన్నారు.

నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఆలూరు నియోజకవర్గంలో నదులు, సాగునీటి కాల్వలు ఉన్నా తాగునీటికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఏ నియోజకవర్గానికి లేనంతగా ఇక్కడి ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. తుంగభద్ర దిగువ కాలువ మరియు ఆలూరు బ్రాంచ్ కాలువ ఇటుగా ప్రవహిస్తున్న ఆయకట్టుకి సరిపడా నీరు అందదు. బోర్లతో వరి పంట వేసిన ఉపయోగం లేకుండా పోయిందని రైతులు బాధపడుతున్నారు. బోర్లు వేసుకున్న కూడా అవి 99% అట్టర్ ఫ్లాఫ్ అయినాయి. రైతులు చాలా దీన స్థితిలో ఉన్నారు.

ఆలూరు పరిధిలో ఎక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు లేవు ఎండాకాలం వచ్చిందంటే స్థానికులు బిందెలతో కిలోమీటర్ల మేర దూరం వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిందే. కరువుకు తోడు నియోజకవర్గంలో జింకల బెడద ఎక్కువగా ఉంది, నీరు లేక ఎంతో ఇబ్బంది పడి సాగు చేస్తే పంటను జింకలు పాడు చేస్తున్నాయి గతంలో వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు అయినా నియంత్రణ సాధ్యం కాలేదు. జింకల కోసం ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయాల్సిందిగా రైతులు కోరుతున్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్య, డ్రైనేజీ సమస్య, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉంది. దాదాపు 100కోట్లుతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన నిధులను తొందరగా విడుదల చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Top