ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

బనగానపల్లి నియోజకవర్గం

బనగానపల్లి - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు నంద్యాల లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 2,16,023 మంది ఉన్నారు.

బనగానపల్లి నియోజకవర్గం 2009 పునర్విభజనలో ఏర్పడింది. అంతకు ముందున్న కోవెలకుంట్ల లోని 4 పాణ్యం పరిధిలోని బనగానపల్లి మండలాలను కలిపి అదే పేరుతో నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. దాంతో కోవెలకుంట్ల సెగ్మెంట్ పూర్తిగా కనుమరుగైపోయింది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఇక్కడే రాసినట్లు చెబుతారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన గుహల్లోని ఒకటైన బెలుం గుహలు ప్రాంతంలోనే ఉన్నాయి. సెగ్మెంట్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో కుడిగట్టు కాలువ కింద ఆయకట్టు ఉన్న నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. దద్దనాల ప్రాజెక్ట్ ఎండిపోవడం వల్ల దాని ప్రభావం చుట్టూ ఉన్న దాదాపు 12 గ్రామాల మీద పడి భూగర్భ జల మట్టం తగ్గిపోయింది. అంతేకాకుండా నియోజకవర్గంలో ప్రతి మండలంలో దాదాపు 10 గ్రామాలలో అయినా తాగునీటి సమస్య ఉంది. యాగంటి పల్లి వాటర్ స్కీమ్ సక్రమంగా పనిచేయక సమీపంలోని గ్రామాల్లో నీటి ఎద్దడి పెరిగింది కోవెలకుంట్ల మండలంలో అవుకు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ద్వారా 156 గ్రామాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కానీ ఆరేళ్ళ క్రితమే అర్ధాంతరంగా నిలిచిపోయింది ఇప్పటికీ పట్టించుకున్నవాళ్లు లేరు.

బనగానపల్లి టౌన్ లో జనాభా పెరుగుతున్న రోడ్లు విస్తరణ మాత్రం జరగడం లేదు. ఇరుకు రహదారులతో స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. శివారు కాలనీల్లో రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. నందవరం ఎస్సీ కాలనీలో వాన కురిస్తే బురద తప్ప రోడ్డు కూడా కనిపించడం లేదు అలాగే నియోజకవర్గంలో మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అలాగే నియోజకవర్గంలో మారుమూల గ్రామాల్లో తేలు, పాముల బెడద ఉంది, ఇళ్ల స్థలాల కోసం వేల సంఖ్యలో అర్హులు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే బనగానపల్లి నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్య ఇప్పుడిప్పుడే పరిష్కారం దొరికే అవకాశం లేనట్లు గా కనిపిస్తుంది. దద్దనాల ప్రాజెక్టుకు అయినా నీరు రప్పించ గలిగితే చాలా వరకు ప్రజలు సంతోషిస్తారు.

Top