కర్నూలు - ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కర్నూలు జనాభా సుమారు 2,33,000 మంది.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ముస్లింలు ఎక్కువగా ఉన్నది ఈ నియోజకవర్గంలోనే, దాదాపుగా ఈ నియోజకవర్గంలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా పట్టణ ప్రాంతమే. 2009 వరదల తర్వాత ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేయటంతో రోడ్లు డ్రైనేజీలు బాగుపడ్డాయి. అయితే పట్టణంలో గతంలో ఎప్పుడూ లేనంత తీవ్రంగా తాగునీటి సమస్య ఉంది. చెప్పుకోవడానికి ప్రభుత్వ నాయకులు అందుబాటులోనే ఉన్నా పనులు మాత్రం జరగడం లేదన్న అసంతృప్తి ప్రజలలో ఉంది. కర్నూలు దగ్గర తుంగభద్ర నది మీద మినీ డామ్ కట్టి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని చెప్పిన ఆచరణలో లేదు. ముచ్చుమర్రి నుండి పైపులైన్ ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ ను తీసుకురావాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది కానీ ఇందుకు ఎంత సమయం పడుతుందో తెలియదు. కుళాయిల్లో నీళ్లు రావు వచ్చిన మురికి నీరు వస్తున్నాయని ప్రజలు అంటున్నారు.
ఈ నియోజకవర్గంలో కర్నూలు కార్పొరేషన్ కీలకమైనది, కృష్ణా పుష్కరాల టైంలో 20 కోట్ల రూపాయలతో పనులు చేశారు అమృత్ పథకం కింద 65 కోట్ల తో తాగునీటి పనులు జరుగుతున్నాయి. నగరం సుందరీకరణ కోసం మూడేళ్లలో ఖర్చు చేసేలా 35 కోట్ల మంజూరయ్యాయి అయితే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు శాసన సభ్యుని అనుచరులకు దక్కేలా నిబంధనలను రూపొందిస్తున్నారని ఆరోపిస్తుంది ప్రతిపక్షం. కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రభుత్వంలో పైకి కనిపించని విభేదాలు ఉన్నాయి, ఎవరికి వారే తమ వారికే పనులు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మీద నియోజకవర్గంలో శాసన సభ్యుని మీద వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉంది. ప్రజలు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు.