ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పత్తికొండ నియోజకవర్గం

పత్తికొండ - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు కర్నూలు  లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పత్తికొండ జనాభా సుమారు 2,00,000 మంది వరకు ఉన్నారు.

పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో బలహీన వర్గాలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. నియోజకవర్గంలో దాదాపుగా 70 శాతం మంది బలహీన వర్గాల వారు ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పత్తికొండ, తుగ్గలి, మద్దికేర, వెల్దుర్తి, క్రిష్ణగిరి మండలాలు ఉన్నాయి. పత్తికొండ నియోజకవర్గం లో ఇసుక అక్రమ తరలింపు పై హైకోర్టులో కేసు వేశారు ఇసుక తరలింపు లో శాసన సభ్యుడి కుమారుని పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి దీనిపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. ప్రధానంగా ఎన్నికల సమయంలో రోడ్లు, తాగునీటి సమస్య పరిష్కరిస్తానని శాసనసభ్యుడు హామీ ఇచ్చారు అలాగే మూతపడిన బస్ డిపో తెరిపిస్తానన్నారు. టమోటా సాగు అధికంగా ఉంది కానీ గిట్టుబాటు ధర లేక రైతుల నష్టపోతుండటంతో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానన్నారు. హంద్రీనీవా నుండి సాగునీరు ఇస్తానని హామీ ఇచ్చారు.  ఇచ్చిన హామీలలో మూతపడిన బస్ డిపోను తెరిపించారు, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్న, కొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జ్యూస్ ఫ్యాక్టరీ స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఫ్యాక్టరీ వ్యవహారం మాత్రం నత్తనడక నడుస్తోంది.

అయితే పల్లెల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది కొన్ని తండాల్లో వారంలో రెండు సార్లు స్నానంతో సరిపెట్టుకునే దురఅవస్థ ఉందంటున్నారు. నేతలు ఎన్ని మాటలు చెబుతున్నా పత్తికొండ ఇంకా ఎంతో వెనుకబడి ఉందంటున్నారు ప్రజలు. రోడ్లు సరిగా లేవు, బస్సులు నడవడం లేదు, ఆసుపత్రి ఉందన్న పేరేగాని ప్రాణం మీదకు వస్తే కర్నూలుకో మరోచోటకో తరలించక తప్పటం లేదు. మరోవైపు పొలాలు ఎండుతున్న ఏమీ చేయలేని నిస్సహాయతతో రైతాంగం ఉంది. హంద్రీనివా కాలువ పత్తికొండ నియోజకవర్గం నుండి వెళ్తున్న దాని కింద సాగయ్యే ఆయకట్టు అతి తక్కువగా ఉంది. ప్రతి కొండ వెనుకబడిన ప్రాంతమని అధికార పార్టీ శాసన సభ్యుడు కూడా అంగీకరిస్తున్నారు. మండల కేంద్రాలు గ్రామాల్లో తీవ్ర నీటి సమస్య ఉంది మద్దికేర, తుగ్గలి, పత్తికొండ మండలాలకు తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. తాగునీటి సమస్య పరిష్కరించాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.

Top