శ్రీశైలం - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు నంద్యాల లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. శ్రీశైలం జనాభా సుమారు 1,83,960 మంది వరకు ఉన్నారు.
కర్నూలు జిల్లాలో కొద్ది తేడాతో రూపం, పేరు మారిన నియోజకవర్గం శ్రీ శైలం. ఒకవైపు మల్లన్న ఆలయం మరోవైపు మహానంది పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతం. 1978లో ఏర్పాటయిన ఆత్మకూరు నియోజకవర్గమే 2009 పునర్విభజనలో శ్రీశైలం నియోజకవర్గంగా మారింది. శ్రీశైలం, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. ఇక్కడ నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి నక్సలైట్ కార్యకలాపాలు విస్తరించాయి ఈ నియోజకవర్గ పరిధిలో మావోయిస్టు అగ్రనేతల ఎన్కౌంటర్ చాలా జరిగాయి, మావోయిస్టులు బలంగా ఉన్న రోజుల్లో ప్రతినిధులు ప్రాణాలు అరచేత పట్టుకొని తిరిగేవారు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ కూలిపోయిన పావురాల గుట్ట ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. ఆయన జ్ఞాపకార్థం నల్ల కాలువలో స్మృతి వనాన్ని నిర్మించారు.
సమస్యల పరంగా చూస్తే వెలుగోడు రిజర్వాయర్ తో, పాటు కె సి కెనాల్, తెలుగు గంగా కాలువలు ఈ నియోజకవర్గం నుండే పారుతున్నాయి, అయినా ఆయకట్టుకు నీరు అందుతుందా లేదా అని రైతులకు ఎప్పుడు ఆందోళనే! 30 ఏళ్ల క్రితమే ప్రతిపాదనలు సిద్ధమై నత్తలతో పోటీపడి నిర్మాణం జరిగిన సిద్దాపురం ఎత్తిపోతల పథకం దాదాపుగా పూర్తయింది కానీ ప్రారంభం కాలేదు చివరి కాలువల పనులు జరుగుతున్నాయి అవి కూడా కొలిక్కి వచ్చి నీరు వదిలితే 23 వేల ఎకరాలు తెలుస్తాయి. ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం మండలాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది వెలుగోడు రిజర్వాయర్ నుండి ఆత్మకూరుకు పైపులైను వేసిన ఏమాత్రం సరిపోవటం లేదు. కాస్త పెద్ద వాన కురిస్తే చాలు ఆత్మకూరులో కాలనీలు మునిగిపోతాయి. డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగంత ఇళ్లలోకి చేరుతుంది. విపరీతమైన వాసన, దోమలు వాటి ద్వారా రోగాల పాలైతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. కృష్ణా నది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పక్కనే ఉన్న సున్నిపెంట లో ఎప్పుడు తాగునీరు, విద్యుత్ సమస్యలే.