ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఎమ్మిగనూరు నియోజకవర్గం

ఎమ్మిగనూరు - ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గం మరియు కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఎమ్మిగనూరు జనాభా సుమారు 2,23,088 మంది వరకు ఉన్నారు.

ఎమ్మిగనూర్, ఒకే నియోజకవర్గం కానీ ఒక ఏరియాలో సీమ మార్క్ ఫ్యాక్షనిజం, మరో ప్రాంతంలో శాంత స్వభావంతో ఉండే ప్రజలు. ఒక చోట వ్యవసాయమే ప్రధానం మరో చోట చేనేతే జీవనాధారం. ఇంత వైవిధ్యం ఉన్న సెగ్మెంట్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఎమ్మిగనూరు పట్టణం, రూరల్ తో పాటు, నందవరం, గోనెగండ్ల మండలాలు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలు కరువుతో అల్లాడుతుండగ, చేనేత కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఎమ్మిగనూరు పట్టణం సహా కొన్ని గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉంది . సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు ఏర్పాటు భూసేకరణ అడ్డంకిగా ఉండటంతో వార్డులో సిస్టం ట్యాంకులు పెట్టిన సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. నందవరం, గోనెగండ్ల మండలాలలో త్రాగు నీళ్ల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అసంపూర్తిగా ఉంది, జరిగిన కొద్ది పనులు కూడా నాసిరకంగా ఉన్నాయి ఇది పూర్తయితే 50 వేల ఎకరాలకు సాగు, చాలా గ్రామాలకు త్రాగునీరు అందుతుంది.

నియోజకవర్గంలో ఉల్లి, మిరప పంటలు ఎక్కువగా పండిస్తారు, కానీ పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బంది పడుతున్నారు రైతులు. నియోజకవర్గంలో మెజారిటీ వర్గమైన చేనేత కార్మికులు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఆదుకుంటానని శాసనసభ్యుడు ఎన్నికల సమయంలో భరోసా ఇచ్చిన ఇంతవరకు పట్టించుకోలేదన్న అసంతృప్తి ఉంది. దాదాపుగా 96 ఎకరాల్లో టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిన ఇంకా శిలాఫలకం దగ్గరే ఉంది. టెక్స్ టైల్  పెట్టామని అధికారులు చెప్తున్నారు కానీ చైర్ బజార్లో ఓపెన్ చేసారు సబ్సిడీ కూడా ఇస్తాం అని చెప్తున్నారు కానీ ఎక్కడుందో కూడా తెలియటం లేదని చేనేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. చేనేత సమస్యలను మరియు సెగ్మెంట్లో నీటి సమస్యలను తీర్చాలని ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Top