ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

ఉదయగిరి నియోజకవర్గం

ఉదయగిరి భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలంలో ఒక పట్టణం. ఈ పట్టణంలో విజయనగర సామ్రాజ్యం పాలనలో రావెల్లా నాయక్ల పాలన ఉంది. ఈ పట్టణాన్ని బాగా బలపర్చి, రావెల్ల పాలకులు అభివృద్ధి చేశారు.

జనాభా

ఉదయగిరి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన బద్వేలు నుండి 56 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామం 3814 ఇళ్లతో, 15870 జనాభాతో 4268 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8011, ఆడవారి సంఖ్య 7859. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2463 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 546.

చరిత్ర

చరిత్రలో ఉదయగిరి పట్టణం యొక్క తొలి ప్రస్తావన 14 శతాబ్దంలో కనిపిస్తుంది. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.

గజపతుల పాలనలోనూ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించాడు. మొత్తం పట్టణాన్ని మరియు దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్ఠమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలు ఉన్నాయి. అందులో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.

ఈరాజ్యమొకప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని సంరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమూ ఉన్నాయి. కలివి కర్రతో చక్కని చెంచాలూ, చిన్నవీ పెద్దవీ, నేడు ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే ఇప్పటికీ తయారు చేస్తున్నారు.

విజయనగర సామ్రాజ్యము స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు చేరియున్నవి. ఉదయగిరి రాజ్యమునకే ములికనాడు అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ పెక్కు ఉన్నాయి. సమిరకుమారవిజయము రచించిన పుష్పగిరి తిమ్మన్న ఆత్మకూరుతాలూకావాడు. విక్రమార్క చరిత్రము వ్రాసినవెన్నలకంటి సిద్ధనకు జక్కన కవి కృతి ఇచ్చెను. సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యమున మత్రిగా ఉండెను.

ఉదయగిరి దుర్గమునేలే బసవరాజు మంత్రియైన గంగన్నకు దుగ్గనకవి తాను రచించిన నాసికేతూపాఖ్యానము కృతి ఇచ్చెను. ఈకాలమున ఉదయగిరి దుర్గము విజయనగరరాజుల చేతులలో నుండి గజపతుల చేతులలో పడెను. బసవరాజే గజపతుల తరుపున ఉదయగిరి దుర్గమును స్వాధీనము చేసుకొని తన యేలుబడిలో నుంచుకొనెనట. ప్రబోధచంద్రోదయమును రచించిన మల్లనసింగనలు పై గంగన్నకే తన కావ్యమును కృతి ఇచ్చిరి.దూబగుంట నారాయణ కవి తాను రచించిన పంచతంత్రమును పై బసవరాజుకు అంకితమిచ్చెను. ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడా పేరు తెచ్చుకొన్నది. అచ్యుతరాయ రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యమునకు రాజప్రతినిధగా రామామాత్యుడుండెను. ఇతడు సర్వమేళకళానిధి అనే ప్రసిద్ధ సంగీత గ్రంథమును రచించెను. దానిని రామరాయలకు అంకితమిచ్చెను. ఇతనికి వాగ్గేయకారతోడరుమల్లు అను బిరుదు ఉంది.అక్బరు కాలమున ఆర్థికమంత్రిగా నుండిన తోడరుమల్లు చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగానుండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్లనూ ఈబిరుదు ఇతనికి ఇచ్చిరట. ఉదయగిరి గ్రామమునకుకొండాయపాలెం అని పేరుకూడ. ఉదయగిరి కొండమీద ఒక ఆలయమున్నది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించెనట. దేవాలయము పక్కన చక్కని కోనేరు ఉంది. వల్లభరాయుడు శ్రీకృష్ణ దేవరాయ  ప్రతినిధి యట. క్రీదాభిరామము  శ్రీనాధుడు వల్లభరాయని పేర వ్రాసినట్లున్నూ, వల్లభరాయడు ఉదయగిరిసీమలోని మోపూరు గ్రామమున వెలసిన భైరవస్వామి భక్తుడనిన్నీ శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసియున్నారు. ఇద్దరు వల్లభరాయలు ఒకరేనని పరిశోధకులు చెప్పుదురు.

రావూరుతాలూకా మొలకలపుండ్లకు కొద్ది దూరములో ఒక కొండ ఉంది. దానిని సిద్ధులయ్యకొండ అంటారు. దానిపై గుహాలయమొకటి ఉంది. ఆలయములో మూడు ప్రతిమలున్నవి. ఒకప్రతిమ నవకోటిసిద్ధుల పేరను, రెండవ ప్రతిమ నవనాధసిద్ధుల పేరను, మూడవది సారంగధరుని పేరను ప్రసిద్ధిచెంది యున్నవి. పై సిద్ధులు కొండపై తపస్సు చేసుకొనుచుండగా సారంగధరుడు వారిని దర్సించుకోవడానికి పోయినాడట. సారంగధరుడొక సిద్ధుడు.

సమస్యలు

  • చెక్ డాం నిర్మాణం లో కొత్త టెక్నాలజీ తేవాలి అని అడిగి మరి 210 చెక్ డామ్ కి నిధులు తెచ్చుకున్నారు కానీ దాని ఊసే లేదు 
  • మండలాల వారీగా పెత్తనం చెలాయిస్తున్న స్థానిక నాయకులు
  • పసుపు స్కాం లో వైసీపీ టీడీపీ నేతల హస్తం
  • బొల్లినేని పాంటించుకోక పసుపు స్కాం జరుగుతుంది
  • ఏళ్ళ తరబడి జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టులు
  • 2009 ఉదయగిరిలో,పెదిరెడ్డి మండలం రెసెర్వొఇర్ ఇంకా పూర్తి కాలేదు
  • మ్మెల్యే బాలినేని ప్రజలకు అందుబాటులో వుండరుఅన్న అభిప్రాయం
  • 1975లో జలగం వెంగల్ రావు  గండిపాలెం ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు 20వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది అన్నారు కానీ అది 4వేలాడేగరేయ్ ఆగిపోయింది దాని పూర్తి చేయాలిఅని కోరిన ప్రజలని ఎవరు పాటించుకోవట్లేదు
  • సీతారాం ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసారు కానీ అది  పైలం డేగరేయ్ ఆగిపోయింది
  • పసుపు రైతులని దళారులు నుంచి పసుపు స్కాం లో చెరియ తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
  • ఒక ప్రశ్రమిక పరిశ్రమ కూడా లేదు,పారిశ్రామిక నిర్మించి ప్రజలకు ఉపాధి కలిపించాలి అని కోరుకుంటున్నారు
  • శ్రీ కృష్ణ దేవరాయల కాలంలోనే వెళ్లిపోయిన ఉదయగిరి 360 దేవాలయాలు ,కోనేరులు ఉండేవి చాలావరకు శిధిలావస్తనికి చేరగా,కొని కాభజా చేసారు కొని గుపాటనిధులు కోసం ధ్వంసం చేసారు .
  • ఉదయగిరి కొండా మీద విలువైన మొక్కలు ఉన్నాయి కనీసం వాటినైనా కాపాడి టూరిసిం చేస్తాను అన్నారు కానీ ఎవరు పాటించుకోవట్లేదు
Top