కందుకూరు చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతం పూర్వం ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పాలించారు, కందుకూరుకు పూర్వ నామం స్కంధ పూరి ,కాలక్రమంలో అది కందుకూరుగా మారింది.
ఈ నియోజకవర్గంలో మొత్తం 194679 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 97174 మంది, 97503 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
అంకమ్మ ఆలయం, అయ్యప్ప ఆలయం , మొగిలిచేర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం మరియు రామాయపట్నం బీచ్ చూడదగ్గ ప్రదేశాలు.
ఈ ప్రాంతంలో పాల ఉత్పత్తులు, పప్పులు, మిరియాలు, మిర్చి,తృణధాన్యాలు మరియు వేరుశెనగల పెంపకం ఎక్కువగా ఉంది. ఉలవపాడు బంగినపల్లి, రసూలు వంటి వివిధ రకాల మామిడిలకు ప్రసిద్ధి చెందింది మరియు ప్రకాశం జిల్లా మరియు నెల్లూరు జిల్లాలోని వివిధ రకాల సాపోటాలకు ప్రసిద్ధి చెందింది . ఇక్కడ ఉత్పత్తి అయిన పండ్లు వివిధ రాష్ట్రాలు మరియు దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్ లో పొగాకు వర్తకానికి ప్రధాన కేంద్రంగా కందుకూరును చెప్పవచ్చు.