ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

కొండపి నియోజకవర్గం

మూసీనది పరివాహక ప్రాంతంగా ఉన్న కొండపి నియోజకవర్గం పొగాకు విక్రయానికి ప్రసిద్ధి.రొయ్యల చెరువులతో పాటు ఆక్వా ఆధారిత పరిశ్రమలును కలిగి ఉంది  కొండపి. పొగాకు క్రయవిక్రయాలకు జిల్లాలోనే ప్రముకమైన టంగుటూరు నుండి ప్రతి ఏటా దేశ  విదేశాలకు పొగాకు పంపిణి జరుగుతుంది  , పొగాకు గ్రేడింగ్ కేంద్రాలు మహిళలకు ఆసరాగా నిలుస్తున్నాయి.

నియోజకవర్గం లో మొత్తం 214864 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 106585 మంది పురుషులు కాగా ,108270 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ప్రసిద్ధ ప్రదేశాలు:

పర్యాటకంగా పాకాల బీచ్ ,ఉల్లిపాలెం బీచ్, సముద్రతీరం మరియు బ్రిటిష్ వారు నిర్మించిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం మరియు వల్లురామ్మ ఆలయం  మరియు నియోజకవర్గంలోని  జరుగుమల్లి మండలంలో జరిగే తిరునాళ్ళు,సింగరాయకొండ వరహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు ప్రసన్నంజనేయ స్వామి ఆలయం అంతో ప్రసిద్ధి పొందాయి.

పంటలు

ప్రధాన పంట వరి కాగా ,వాణిజ్య పంటగా పొగాకు సాగులో ఉంది.

నియోజవర్గపు సమస్యలు:

  • జీవం కోల్పోయిన మూసి నది
  • సంగమేశ్వరం ప్రాజెక్ట్  నిర్మాణం పూర్తయితే సుమారు 10 వేళా ఎకరాలకు సాగునీరు అందుతుంది.
  • ఉపాధి కోసం ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు.
  • పేరుకు మాత్రమే ఉండి అభివృద్ధికి నోచుకోని టంగుటూరు మరియు సింగరాయకొండ రైల్వే స్టేషన్లు.
Top