పురాతన కలం నుండి ఖ్యాతి కలిగి సుమారు క్రీ.పూ. 230లో మౌర్యులు,శ్రీకృష్ణ దేవరాయలు మరియు 3వ శతాబ్దానికి చెందిన పల్లవులచే పాలింపబడిన ఒంగోలు వివిధ సంస్కృతుల మిశ్రమం అని చెప్పవచ్చు. ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత సంకీర్తన ఆచార్య శ్రీ అన్నమాచార్య యొక్క జన్మస్థలం.ఒంగోలు పేరు వినగానే గుర్తుకు వచ్చేది దేశంలోనే అత్యుత్తమ మేలిరకం గిత్తలుగా ఖ్యాతిని ఆర్జించి ,విశ్వాసానికి మారుపేరుగా,పోరుషానికి ప్రతీకగా నిలిచిన ఒంగోలు గిత్తలు . ఒంగోలు గిత్తలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. ఇక్కడ గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు భారీ ఉపాధి వనరును అందిస్తాయి.
ఈ నియోజకవర్గంలో మొత్తం 233890మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 114575 మంది పురుషులు కాగా,119289 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ కు తొలి ముఖ్య మంత్రివర్యులుగా ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ ప్రాంతానికి చెందిన వారే .
పాల ఉత్పత్తులు ,పప్పులు, పొగాకు ,మిరియాలు ,ధాన్యాలను ఇక్కడ ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు.
అద్భుతమైన బీచ్లు మరియు ప్రాచీన దేవలయాలను కలిగి ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రముఖంగా కొత్తపట్నం బీచ్, 13వ శతాబ్దం లో నిర్మించిన చెన్నకేశవ ఆలయం ,కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ,టంగుటూరులో 1116లో నిర్మింపబడిన శివాలయం మరియు చన్నకేశవాలయం ,చందవరం బౌద్ధస్థూపం మరియు శ్రీ రాజారాజేశ్వరస్వామి ఆలయ సముదాయం, భైరవకోన చూడదగ్గ ప్రదేశాలు .