ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

సంతనూతలపాడు నియోజకవర్గం

గెలాక్సీ గ్రానైట్ గనులు ,మైనింగ్ నిక్షేపాలును కలిగి ఉండి, కోట్ల రూపాయల టర్నోవర్ ,వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో, ప్రకాశం జిల్లా మొత్తంమీద ధనిక నియోజకవర్గంగా పేరుగాంచింది సంతనూతలపాడు నియోజకవర్గం.

ఈ నియోజకవర్గంలో మొత్తం 201912 మంది ఓటర్లు ఉన్నటు. వీరిలో 100134 మంది పురుషులు కాగా, 101764 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

పంటలు

సేంద్రియ ఎరువులతో పండ్లు మరియు కూరగాయల పెంపకం సాగులో ఉంది. వరి ప్రధాన పంట కాగా ,వాణిజ్య పంటగా పొగాకును ఎక్కువ మొత్తంలో సాగు చేస్తున్నారు.

నియోజవర్గపు సమస్యలు:

  • వర్షాలు కురిసినప్పుడు మద్దిరాలపాడు వద్ద పొంగి ,రాకపోకలకు అంతరాయంగా ఉన్న గుండ్లకమ్మ .
  • మరియు భారీ వర్షాలు కురిస్తే ప్రముఖ పట్టణాలైన  ఒంగోలు మరియు చీరాల మధ్య రాకపోకలు బంద్.
  • సంవత్సరాలు గడిచినా నిడివేరని గుండ్లకమ్మ ప్రాజెక్ట్ మరియు కాలువల లక్ష్యం.
  • కనీస సదుపాయాలు కూడా లేక ఇబంధులు పడుతున్న పునరావాస కాలనీ ప్రజలు.
  • డ్రైనేజి నిర్మాణం సరిగ్గా లేక ఎక్కడికక్కడ మురుగునీళ్లు నిలిచిపోతున్నాయి.
  • పక్కనే రామతీర్ధం  జలాశయం ఉన్నా తీరని మంచినీటి కష్టాలు. మరియు ఫ్లోరైడ్ కష్టాలు.
  • వసతులు లేని ప్రభుత్వ ఆసుపత్రుల వ్యవస్థతో ఇబంది పడుతున్న డయాలసిస్ రోగులు.
  • గ్రానైట్ ఫ్యాక్టరీలు,కంకర మిల్లులతో పెరిగిపోయిన కాలుష్యం.
  • ఈ యస్ ఐ ఆసుపత్రి మరియు రహదారుల విస్తరణ హామీలను మరిచిపోయిన అధికారులు.
Top