పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో, ఆచంట నియోజకవర్గం ఒకటి. ఒడయనంబి అనే శివభక్తుడు చన్నుని పూజించడంతో ఏర్పడిన శివలింగం ఇక్కడ ఉందని కావ్యప్రశస్తి. ఆ చంట (ఆ చన్నున) శివుడు వెలసిన కారణంగా ఆయనను ఆచంటేశ్వరుడని, గ్రామాన్ని ఆచంట అనే పేర పిలుస్తూంటారు. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 159616. అందులో ఆడవారి సంఖ్య 81040 కాగా మగవారి సంఖ్య 78576 గా నమోదయింది. ఈ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో వరి, కొబ్బరి మరియు కూరగాయలు అధిక మొత్తంలో సాగు చేస్తారు.