ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

భీమవరం నియోజకవర్గం

పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలోభీమవరం నియోజకవర్గం ఒకటి. భీమవరం పట్టణం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రముఖ పట్టణాలలో ఒకటి. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో పూజ్య బాపూజీ, భీమవరం నగరానికి 'రెండవ బార్దొలి' అని బిరుదు ప్రధానం చేశారు.

చేపల చెరువుకు మరి ఆక్వా పరిశ్రమలకు పెట్టింది పేరు ప్రాంతం. సంక్రాంతి సమయంలో ఇక్కడి నిర్వహించే కోడి పందాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 225646. అందులో ఆడవారి సంఖ్య 114598 కాగా మగవారి సంఖ్య 110965 గా నమోదయింది. వరి, అపరాలు మరియు కాయగూరలు ఇక్కడి వాణిజ్య పంటలు.   

ప్రసిద్ధ ప్రదేశాలు:

  • మావుళ్ళమ్మ దేవస్థానం
  • సోమేశ్వరస్వామి దేవాలయం
  • నియోజకవర్గంలోని మండలాలు:
  • వీరవాసరము
  • భీమవరం (పాక్షికం)

నియోజకవర్గపు ప్రముఖులు:

అడవి బాపిరాజు

అల్లూరి సీతారామరాజు భీమవరం దగ్గరలొని మోగల్లు గ్రామానికి చెందినవారు

భూపతిరాజు రామకృష్ణంరాజు, విద్యావేత్త, రాజకీయవేత్త, మాజీ .పి.పి.యస్సీ సభ్యులు

డా.యల్లాప్రగడ సుబ్బారావు ప్రముఖ శాస్త్ర వేత్త

నియోజవర్గపు సమస్యలు:

  • ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోయే కాలువలు.
  • తాగు నీటి సమస్య తీవ్రం.
  • ఇరుకు రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్ మారియు రైల్వే లైన్ సమస్యలు ఇక్కడ అధికం.
Top