పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో, చింతలపూడి నియోజకవర్గం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లలో అటు ఖమ్మం జిల్లా (తెలంగాణా రాష్ర్టము)నకూ, ఇటు కృష్ణా జిల్లాకూ సరిహద్దుగా ఉంది. మెట్ట ప్రాంతంగా పేర్గాంచిన చింతలపూడి, పామాయిల్, మామిడి మరియు అరటి పంటలకు ప్రసిద్ధి చెందినది. ఈ జిల్లా మొత్తంలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గం ఇదే.
ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 240021. అందులో ఆడవారి సంఖ్య 120511 కాగా మగవారి సంఖ్య 119488 గా నమోదయింది. నూతనంగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక బొగ్గు నిక్షేపాలు ఇవే కావడం విశేషం.
జిల్లాలోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రము ద్వారకాతిరుమల, చింతలపూడికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది.
చింతలపూడి త్రినాధరావు : సంగీతకారుడు మరియు సాహిత్యాభిమాని.