ఏలూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఏల అన్న చిన్న ఏరు ఈ పట్టణ పరిసరాల్లో ప్రవహించడంతో ఏలూరు అన్న పేరు ఏర్పడివుంటుందని బూదరాజు రాధాకృష్ణ వంటి పరిశోధకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 207048. అందులో ఆడవారి సంఖ్య 106880 కాగా మగవారి సంఖ్య 100159 గా నమోదయింది.
ప్రసిద్ధ ప్రదేశాలు:
- జ్వలాపహరేశ్వర స్వామి వారి ఆలయం, దక్షిణపు వీధి (ఇది అత్యంత ప్రాఛీన ఆలయం)
- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, పడమరవీధి (ప్రాచీన ఆలయం స్థాపితం : క్రీ.శ.1104) .
నియోజకవర్గపు ప్రముఖులు:
- సి. ఆనందారామం
- వి. యస్. రమాదేవి (భారతదేశం గర్వించతగ్గ అడ్మినిస్ట్రేటర్, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. రాజ్యసభ మాజీ సెక్రటరీ జనరల్)
- దువ్వూరి సుబ్బారావు (మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్)
- ఎల్.వి.ప్రసాద్ (సినిమా రంగం, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రసాద్ లాబ్స్ అధినేత)
ఈ నియోజవర్గపు సమస్యలు:
గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
ప్రధాన పంటలు
వరి, కూరగాయలు, పొగాకు వర్తకం, చేపల ఎగుమతి