పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి. కొవ్వూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. గోదావరి నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రి (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 196500. అందులో ఆడవారి సంఖ్య 100983 కాగా మగవారి సంఖ్య 95509 గా నమోదయింది.
కొవ్వూరు నుండి రాజమండ్రి వరకు గోదావరి పై కట్టిన మూడు వంతెనలు ఇక్కడి ప్రత్యేకత. సుమారు నూరు సంవత్సరాల క్రితము సర్. ఆర్థర్ కాటన్ కట్టించిన రైలు వంతెన ఇప్పటికి చెక్కుచెదరకండా ఉండటం విశేషం. పన్నెండు వత్సరములకొక సారి వచ్చే గోదావరి పుష్కరములందు దేశపు నలుమూలల నుండి ఆశేష భక్తజనం ఈ గోష్పాద క్షేత్రమును దర్శించి, పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరిస్తారు.
సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
పొగాకు