పశ్చిమ గోదావరి జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో పోలవరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఇది సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. ఇది జిల్లాలో ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన ఏకైక నియోజకవర్గం. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 190811. అందులో ఆడవారి సంఖ్య 97355 కాగా మగవారి సంఖ్య 93447 గా నమోదయింది.
పూనెం సింగన్నదొర
కోండ్రుకోట గ్రామ సర్పంచి పదవి నుండి పైకి ఎదిగిన నేత సింగన్నదొర. 1981 నుండి కోడ్రుకోట సర్పంచులుగా ఆయన, అతని కుటుంబ సభ్యులే పనిచేస్తున్నారు. 1978లో రెడ్డి కాంగ్రెస్ తరఫున శాసనసభ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోగా, 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పొందినాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి 1987 ఉపఎన్నికలలో పోటీ చేసిననూ ఓడిపోయాడు. 1994లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1999 మరియు 2004లలో తెలుగుదేశం పార్టీలోనే ఉన్ననూ పార్టీ టికెట్ లభించలేదు. 2009లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేస్తున్నాడు.
సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
వరి, మొక్కజొన్న, మినుము