పచ్చిమగోదావరి జిల్లాలోని తణుకు అసుర రాజైన తారకాసురుని రాజధానిగా ఉండేది,కావున ఈ ప్రాంతం తారకాపురి అని పిలువబడేది ,కాలక్రమంలో అది తణుకుగా రూపాంతరం చెందింది.వ్యవసాయంతో పాటు ,పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తణుకు ప్రధాన వస్త్ర కేంద్రంగా కూడా ప్రసిద్ధిపొందింది.ఉండ్రాజవరం,అత్తిలి,తణుకు మరియు ఇరగవరం ఈ నియోజకవర్గ పరిధిలోని మండలాలు.
ఈ నియోజకవర్గంలో మొత్తం 219225 మంది ఒఓటర్లు ఉండగా, వీరిలో 106579 మంది పురుషులు,112646 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
అరటి, చెరకు, కొబ్బరికాయలు మరియు అనేక రకాలైన కూరగాయలు వంటి ఇతర ప్రధాన పంటలతోపాటు ,అదనంగా ఆంధ్ర షుగర్ కంపెనీ ద్రవ రాకెట్ ఇంధనాన్నివిజయవంతంగా ఉత్పత్తి చేస్తుంది.
మొదటి తెలుగు భాషా కవి,మహాభారతంను సంస్కృతం నుండి తెలుగుకి అనువదించిన ఆదికవి నన్నయ తణుకుకు చెందినవారే .ప్రముఖ కూచిపూడి నర్తకి అంబిక ,జవ్వాడి యామిని నరసాంబిక,పారిశ్రామికవేత్త హారిశ్చంద్ర ప్రసాద్ ఈ ప్రాంతంవారే.