వరి పైరులు ,చేపల చెరువులతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉన్నఉంగుటూరు నియోజకవర్గం కొల్లేరు ప్రాంతాన్ని అత్యధికంగా కలిగి ఉండి,గోదావరి డెల్టా కాలువల ఆధారిత వ్యవసాయ ప్రాంతం అవడంతో వరి పైరులు ఒకపక్క,చేపల చెరువులు మరియు రొయ్యల చెరువులు మరో పక్క దర్శనమిస్తాయి. అభివృద్ధి పధంలో పరుగులు పెడుతూ ,రైసుమిల్లులకు కేంద్రమైన ఈ నియోజకవర్గం ప్రస్తుతం ఆక్వా ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా మారింది. ఈ నియోజకవర్గంలోని భీమడోలుకు ఘనమైన చరిత్ర ఉంది. మహాభారత చరిత్రలో ఉంగుటూరు ప్రాంత ప్రస్తావన ఉంది అని చెపుతారు,పాండవులు వనవాసం చేసే సమయంలో భీముడికి ,బకాసురునికి మధ్య జరిగిన యుద్ధంలో బకాసురిని తోలువలిచి డప్పుగా వాయించిన కధ ఆధారంగా భీమడోలు అనే పేరువచ్చింది అని చెప్తుంటారు.
భీమడోలు,ద్వారకాతిరుమల,ఉంగుటూరు , నల్లజర్ల మండలాలు ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 187935 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 93498 మంది పురుషులు కాగా,94430 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
కైకరంలోని సుభ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సంతాన సమస్యలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి. ఇక్కడ షష్ఠి ఉత్సవాలు రాష్ట్రంలోనే అత్యంత ఘనంగా జరుగుతాయి. ద్వారకాతిరుమల ,చిననిండ్రకొలను లోని గాంధీభవనము .
స్వతంత్ర సమరయోధులు,మాజీ మంత్రి దివంగత చింతలపాటి సీతారామచంద్ర వరప్రసాద మూర్తి రాజు స్వతంత్ర సమర పోరాటంలో గాంధీజీతో కలిసి పోరాడి,గాంధీజీపై అనేక రచనలు రాయడమే కాక ,స్వగ్రామంలో పార్లమెంటును పోలివుండే భవనాన్ని నిర్మించి అందులో గాంధీపై రచనలతో కూడిన లైబ్రరీని ఏర్పాటుచేశారు.
వరితో పాటు ప్రధానంగా ఆక్వా, చేపలు ,రొయ్యల పెంపకాన్ని ఇక్కడ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.