ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

పశ్చమ గొదావరి

తూర్పుగోదావరిజిల్లా పొరుగునే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్రానికి పూర్వం తూర్పు  చాళుక్యులు, గజపతుల, విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు, బ్రిటిషువారి పాలనలో ఉన్నందువలన  'ప్రత్యేక చారిత్రక నేపధ్యాన్ని వారసత్వంగా పొందింది.  ఏలూరు ప్రధాన కేంద్రంగా గల ఈ జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 3,936,966 మంది ప్రజలు నివసిస్తున్నారు.    వీరిలో మగవారి సంఖ్య  1,964,918 ఉండగా, 1,972,048 మంది మహిళలున్నారు.    5 రెవెన్యూ డివిజన్లుగా విభజించబడిన ఈ జిల్లాలో 48 మండలాలు, 8 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 6 సెన్సెస్ పట్టణాలు ఉన్నాయి. 

15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ జిల్లా అక్షరాస్యత 74.63%. ఈ జిల్లాలో మొత్తం 4408 ప్రాధమిక, ఉన్నత, ఎయిడెడ్ , ప్రవేటు  పాఠశాలలున్నాయి. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, జాతీయ ఉన్నత సాంకేతిక విద్యాలయం, డా. వైస్సార్ హార్టీకల్చరల్ విద్యాలయాలున్నాయి.

45,963 కోట్ల వార్షిక ఆదాయంతో ఈ జిల్లా రాష్ట్ర ఆర్ధిక అబివృద్దికి 8.8% ఆదాయాన్ని సమకూరుస్తుంది. వ్యవసాయ ప్రధానమైన ఈ జిల్లాలో వరి, చెరకు, అరటి, కొబ్బరి, జీడీ, మామిడి, పొగాకు  పంటలు విస్తారంగా పండుతాయి. మత్స్యపరిశ్రమతో బాటు, ఉన్ని తివాచీ  పరిశ్రమలు కూడా ఈ జిల్లా ఆర్ధిక అభివృద్ధిలో కీలక పాత్ర పోస్షిస్తున్నాయి.

ఈ జిల్లాలో అనేక ప్రాచీన బౌద్ధ, హిందూ క్షేత్రాలున్నాయి.  గుంటుపల్లి గుహలు, ఏలూరుకు సమీపంలోగల 74 అడుగుల బుద్ధ విగ్రహం జిల్లాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు. చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమల,  భీమవరం, పాలకొల్లు లలో పంచారామక్షేత్రాలు అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నది.  నరసాపురం లో ఉన్న పేరుపాలెం బీచ్, ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు, పక్షుల సంరక్షణ కేంద్రం, గోదావరి నది,  ధవళేశ్వరం బ్యారేజ్ ఈ జిల్లాలోగల ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు. 

Top