ఆమదాలవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక చిన్న పట్టణము మరియు, ఇదే పేరుతో పురపాలక సంఘము, శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. శ్రీకాకుళం రోడ్,రైల్వే స్టేషను ఈ ఊరిలోనే ఉంది. ఇది శ్రీకాకుళంనకు 8 కి.మీ. దూరములో ఉంది. శ్రీకాకుళం జిల్లాలో గల 4 పురపాలక సంఘాలలో ఇది ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆమదాలవలస మొత్తం జనాభా 84,093. వీరిలో పురుషులు 41,907 కాగా స్త్రీలు 42,186.
ఆమదాలవలస మండలం ఉత్తర సరిహద్దులో సరుబుజ్జిలి మండలం , పశ్చిమాన సంతకవిటి మండలం , ఉత్తర వైపున బుర్జ మండలం , దక్షిణాన పొందూరు మండలం ఉన్నాయి. ఆమదాలవలస , శ్రీకాకుళం , రాజాం, పాలకొండ , ఆమదాలవలసకు సమీపంలోని నగరాలు.
ఈ ఊరు చారిత్రిక ప్రాధాన్యం గలది. పుర్వం ఈ గ్రామం పేరు హేరండపల్లి. హేరండం అంటే సంస్కృతంలో ఆముదం అని అర్ధం. ఇక్కడికి దగ్గరలో సంగమయ్య కొండ అనే ప్రాంతం ఉంది. నిజానికి అదో జైన పూజా స్థలం. ఆముదాలవలసలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
ఆనందపురం అతిచిన్న గ్రామంగా ఉంది . ఇది 34 మీటర్ల ఎత్తులో ఉంది . ఇక్కడ తెలుగు స్థానిక భాష. మొత్తం 39 గ్రామాలు, 30 పంచాయతీలలో విస్తరించింది.