పొందూరు (Ponduru), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. పొందూరు శ్రీకాకుళమునకు 20 కి.మీ దూరంలో ఉంది. ఖద్దరు, హస్తకళలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము. భారత దేశంలో ఖాదీ వస్త్ర ప్రియులకు యిష్టమైన ఖద్దరును తయారుచేసే ప్రాంతం పొందూరు. పొందూరు నకు 7 కి.మీ దూరంలో నందివాడలో ని బాలయోగీశ్వరస్వామి ఆశ్రమం ప్రసిద్ధి చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పొందూరు జనాభా మొత్తం 73,890 ,వీరిలో పురుషులు 37,197 కాగా, స్త్రీలు 36,693.
ఇది శ్రీకాకుళం నుండి పశ్చిమాన 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. పొందూరు మండల దక్షిణ సరిహద్దులో ఎచ్చెర్ల మండలం , ఉత్తర దిశగా ఆమదాలవలస మండలం , తూర్పు వైపు శ్రీకాకుళం మండలం , పశ్చిమ దిశగా గంగావరిసిగడమం మండలం సరిహద్దులుగా ఉన్నాయి. శ్రీకాకుళం , ఆముదాలవలస , రాజం, విజయనగరం నగరం ,పొందూరు కు సమీపంలోని నగరాలు. 39 గ్రామాలు మరియు 29 పంచాయితీలు ఉన్నాయి. కళ్యాణిపెట్టి చిన్న గ్రామం మరియు పొందూరు అతిపెద్ద గ్రామం. ఇది 39 మీటర్ల ఎత్తులో ఉంది .
పొందూరు ఖద్దరు
పొందూరు చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి చేనేత. ఒకవిధమైన చేప దంతాలతో ప్రత్తిని శుభ్రం చేసి దానిని రాట్నాలను ఉపయోగించి దారాన్ని తీస్తారు. ఈ దారాలనుపయోగించి మగ్గాలపై ఖద్దరు బట్టలను నేస్తారు. పొందూరు ఖద్దరు అనునది భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తు చేస్తుంది. మహాత్మా గాంధీ కూడా పొందూరుకు చెందిన ఖద్దరును యిష్టపడే వారు. పొందూరు ఖాదీ దేశమంతటా ఖాదీ బట్టలు వేసుకునే వారికి ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతంలో దేవాంగ, పట్టుశాలి, నాగవంశం అనే కులాలు ముఖ్యమైనవి. ప్రత్తిని శుభ్రం చేసి రాట్నాలతో దారాన్ని తీసి మగ్గాలపై చక్కని ఖద్దరు వస్త్రాలను నేస్తారు. మగ్గాల తోనేకాక యంత్రపరికరాలు, మరమగ్గాల ఆధారంగా ఖద్దరు ఇతర రకాల నేతలు నేయు నేతగాళ్ళు కలరు. అమెరికా, స్వీడన్ వంటి దేశాలకు ఎగుమతులు కూడా జరిగేవి
చేనేత, ఖాదీ ఈ రెండు పరిశ్రమలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిశ్రమపై 1500 మంది జీవిస్తున్నారు. నూలు సమస్య, దళారుల బెడద. గిట్టుబాటు ధర లేక నేతన్నలు వలసలు పోతున్నారు. రోజంతా కష్టపడినా రూ.50 లు రావడం లేదు. పొందూరు ఖాదీకి ఉన్న అంతర్జాతీయ ఖ్యాతిని కాపాడాలి. ఖాదీ పరిశ్రమ కు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మండలంలో 22 మేరకు ప్రాంతాలకు సాగునీరు లేదు. పూర్తి వర్షాదారం