ఉత్తరాంధ్ర గురించి తిత్లీ తుఫాన్ సహాయ కార్యక్రమాలు సామాజిక విశ్లేషణలు ఉత్తరాంధ్రకు ఉపాధి

విశాఖపట్నం

విజయనగరం

శ్రీకాకుళం

జాలంత్రకోట పంచాయతీ

జాలంత్రకోట, శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంచిలి నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఇచ్ఛాపురం నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 807 ఇళ్లతో, 3322 జనాభాతో 958 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1653, ఆడవారి సంఖ్య 1669. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 164 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 66. గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. జలంత్రకోటలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది.

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

జలంత్రకోటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 83 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 78 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 794 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 537 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 258 హెక్టార్లు

ప్రధాన పంటలు : వరి, జీడి, పెసర

ఉత్తరాంధ్రను వణికిస్తున్న ‘టిట్లీ’ తుపాను శ్రీకాకుళం జిల్లాలో పెను విధ్వంసం సృష్టించింది. దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు. జాలంత్రకోటలో దాదాపు 24సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. అన్నదాతను తిత్లీ తుపాను నిండా ముంచేసింది. గంటల వ్యవధిలో వెన్ను విరిచేసింది. అపార పంటనష్టం కలిగించి రైతన్నకు తీరని కడుపుకోత మిగిల్చింది. భీకర గాలులు, కుండపోతవర్షానికి జాలంత్రకోట వద్ద గల గంగాసాగరానికి గండి పడటంతో రోడ్డు మీద నుంచి నీరు ప్రవహిస్తుంది. మరియు గ్రామంలో జీడి తోటలకు భారీ నష్టం ఏర్పడింది.

ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని మండలాలు
Top
మీ
కా
మెం
ట్
రా
యం
డి